ENGLISH | TELUGU  
Home  » TV News

అమ్మాయిలు ఎప్పుడు అందంగా ఉంటారు..బ్రేకప్ ముందా ? తర్వాత ?

on Feb 14, 2026

 

ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. వస్తూనే ఫైమా డాన్స్ తో ఫుల్ రచ్చ చేసింది. ఇందులో సెలబ్రేషన్ థీమ్ తో కంటెస్టెంట్స్ రాబోతున్నారు. "ఏ ఫంక్షన్ ఐనా ఏ సెలబ్రేషన్ ఐనా సెలబ్రేషన్ మాత్రం ధూమ్ ధామ్ ఉంటుంది" అంటూ నందు చెప్పేసరికి ఫైమా డాన్స్ చేస్తూ వచ్చింది. "బాబోయ్ ఫైమా ఏంటి ఈ రచ్చ ఏంటి సెలబ్రేషన్" అని హోస్ట్ నందు అడిగేసరికి "పోయిన వారమే కదా నేను ఢీలో కనిపించింది. వెంటనే ఒకడు షాప్ కి పిలిచాడు" అంది. "ఎందుకు ఊడవడానికా" అని అడిగాడు నందు. దానికి ఫైమా కాదు అంటూ ముఖం చిట్లించింది. ఇంతలో ఆది మీదా పూలు జల్లుతూ డప్పులతో ఊరేగిస్తూ తీసుకొచ్చారు. "నువ్వు కాదు చేసింది ఇదంతా" అంటూ నందు మీద ఫైర్ అయ్యాడు. "ఎం నేనేం చేసాను" అన్నాడు నందు. "అమ్మాయి వస్తుంది అమ్మాయి వస్తుంది అన్నావ్. ఏ నయనతారో వస్తుంది అనుకున్నా ఈ అవతార్ వస్తుందని నాకేం తెలుసు" అన్నాడు ఆది. 


తర్వాత ఆది జతిన్ ని ఒక ప్రశ్న వేసాడు. "అరేయ్ అమ్మాయిలు బ్రేకప్ కి ముందు అందంగా ఉంటారా బ్రేకప్ తర్వాత అందంగా ఉంటారా" అని అడిగాడు శార్వరిని చూస్తూ. "బ్రేకప్ ముందరే బాగుంటారు" అంటూ జతిన్ ఆన్సర్ ఇచ్చాడు. "మరి ఈ అమ్మాయెంట్రా ఇప్పుడు ఇంత అందంగా ఉంది" అంటూ శార్వరిని చూస్తూనే అన్నాడు ఆది. దాంతో ఇక్కడ జతిన్ అక్కడ శార్వరి తెగ సిగ్గుపడిపోయారు. "జతిన్ బ్రేకప్ తర్వాత నెక్స్ట్ లవ్ ఉంటుంది కదా అది జెన్యూన్ గా ఉంటుందా అది ఫేకా" అని అడిగాడు ఆది. " జెన్యూన్ గానే ఉంటుంది" అంటూ ఆన్సర్ ఇచ్చాడు జతిన్. "వెంటనే సెకండ్ లవ్ జెన్యూన్ గా ఉంటుందా" అని మళ్ళీ అడిగాడు. "వెంటనే ఎవరన్నా చేస్తారు" అన్నాడు జతిన్. "ఒకవేళ మనం బ్రేకప్ తర్వాత ఇంకొకళ్ళతో లవ్ లో ఉన్నప్పుడు ముందోళ్లు ఎప్పుడైనా గుర్తొస్తారా" అని మళ్ళీ జతిన్ ని అడిగాడు ఆది. "లేదన్నా రారు" అని చెప్పాడు. "ఒకవేళ వస్తే వాళ్ళ నంబర్ మన దగ్గర ఉంటదా బ్లాక్ లో ఉంటదా" అని మళ్ళీ రెచ్చగొట్టాడు. "అన్నా నాకేం తెలీదన్నా ఎం తెలీదు" అంటూ సీరియస్ ఐపోయాడు జతిన్. జతిన్ - శార్వరి ఒకప్పుడు రిలేషన్ లో ఉండేవారు ఐతే మూడేళ్ళ క్రితం బ్రేకప్ అయ్యిందంటూ శార్వరి లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది.



 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.