
ఢీ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆది బయో డేటా బాగా వైరల్ అవుతోంది. అందులో రకరకాల పాయింట్స్ ఉన్నాయి. "పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నవాళ్లు మన మధ్యలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ బయో డేటాలు ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి. ముందు వాళ్ళ బయో డేటా చూద్దాం వాళ్ళు పెళ్ళికి అర్హుల కాదా అని వాళ్ళను మనం జడ్జ్ చేద్దాం " అంటూ నందు చెప్పాడు.
.webp)
అది బయో డేటా పేరు చూడండి హైపర్ ఆది. ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే సో మెనీ ఫామిలీస్ అని చూపించారు. అదేంటి ఇన్ని ఫామిలీస్ అని నందు అడిగాడు. అందరూ మన ఫామిలీ లాంటి వా.ళ్ళే అని చెప్పాడు ఆది. గోల్ అంటే గర్ల్స్ అని ఉందేంటి అని అడిగాడు. మన లక్ష్యం అదే కదా అన్నాడు ఆది సైగలా ద్వారా. హాబీస్ ఏంటంటే చాటింగ్, మీటింగ్, డేటింగ్ తో పాటు ఈటింగ్ కూడా అన్నాడు ఆది. ఎప్పుడూ మూడు పూట్ల తినడమే అని నందు అనేసరికి ఎప్పుడూ ఆకలి ఆకలి అంటూ రెజీనా కౌంటర్ ఇచ్చారు. ఆ నిక్ నేమ్స్ ఏంటో చూడండి కక్కుర్తి వెధవ, పులిహోర రాజా, ఆటగాడు, పిచ్చి డాష్ అని ఉంది. ప్లేయింగ్ స్టైల్ లోకి వచ్చేసరికి టెస్ట్ లాంగ్ ఇన్నింగ్స్ అని ఉంది. నిజంగానే టచ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం మాష్టర్. 300 స్ , 400 స్ కొట్టే స్కోప్ ఉంటది మనకు అన్నాడు ఆది... "స్కోప్ ఉంటది కానీ " అని రెజీనా అనేసరికి "ఓపిక ఉంటదా అంటారా " అంటూ లైన్ ఫీల్ చేసాడు ఆది. ఇక బిన్నీ మాష్టర్ ఐతే "ఈ బయోడేటా చూసాకా ఈజీగా పెళ్లి " అని చెప్పేసరికి మధ్యలో రెజీనా "అవ్వదు" అనేసారు. తర్వాత మరో ఎంటర్టైన్మెంట్ పిక్స్ ని చూపించాడు నందు.

"మొట్టమొదటి సారిగా ఆది ప్రీ వెడ్డింగ్ షూట్ ని ఢీ 20 ప్రేక్షకుల కోసం ఆవిష్కరించబోతున్న ఢీ 20 టీమ్ " అనేసరికి వెనక పిక్స్ వచ్చాయి. ఆది తన కాబోయే వైఫ్ తో కలిసి రొమాంటిక్ స్టిల్ లో నిలబడడం పెళ్లి చేసుకోవడం, ఓకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసి తాగడం చూపించేసరికి ఆది కూడా నవ్వుకున్నాడు. "ఎవర్తిరా అది, ఎవర్రా అది రాజమండ్రీ శ్రీదేవిలా ఉంది తియ్యరా బాబు " అంటూ ఆ అమ్మాయి పరువు తీసేసాడు.





