Brahmamudi : తన కన్నకూతురిని చూసి కావ్య ఎమోషనల్.. దుగ్గిరాల ఫ్యామిలీ హ్యాపీ!
on Feb 11, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -952 లో..... రౌడీలని రాజ్ కొడతాడు. కావ్య చేతికి చిన్న గాయం అవుతుంది. అప్పుడే మినిస్టర్ వచ్చి రౌడీలని పంపిస్తాడు. రేయ్ నువ్వు మనిషివేనారా కన్నబిడ్డని చంపాలని అనుకున్నావని రాజ్ మినిస్టర్ పై కోప్పడతాడు. నన్ను క్షమించు రాజ్.. నా మూర్ఖత్వంతో నేను చాలా పెద్ద పొరపాటు చేసానని మినిస్టర్ అంటాడు. అప్పుడే తులసి వచ్చి అదంతా వింటుంది.
నా దగ్గర ఉన్న బిడ్డ నా బిడ్డ కాదా ఎందుకు ఇంత మోసం చేసారని తులసి ఏడుస్తుంది. మినిస్టర్ గారు మీపై ప్రేమతోనే ఇదంతా చేశారు కానీ ఇంకొక తల్లి కూడా బాధపడుతుందని ఆలోచించలేదని కావ్య అంటుంది. తులసి తన దగ్గరున్న పాపని కావ్యకి ఇస్తుంది. కావ్య తన బిడ్డని చూసి ఎమోషనల్ అవుతుంది. డాక్టర్ తులసి పాపని తీసుకొని వస్తుంది. తులసికి పూర్తి ఆరోగ్యవంతం అయిన పాపని రాజ్ అప్పగిస్తాడు. మరొకవైపు కావ్య, రాజ్ పాపని తీసుకొని ఇంటికి వెళ్తారు. పాప మొదటి సారి ఇంటికి వచ్చినందుకు అపర్ణ దిష్టి తీసి హారతి ఇస్తుంది. కావ్య తన బిడ్డని పట్టుకొని అత్తయ్య చూడండి నా కన్నబిడ్డ అని కావ్య ఎమోషనల్ అవుతుంది.
పాపకి బారసాల చెయ్యాలని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇప్పుడే కాదు నాకు బిడ్డ పుట్టాక ఇద్దరికి ఒకేసారి అని అప్పు అంటుంది. పాపని చూసి అందరు మురిసిపోతారు. మరొక వైపు ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి డిస్సపాయింట్ అవుతుంది. నేను దూరంగా ఉంటే ఏం చెయ్యలేకపోతున్నాను.. మళ్ళీ ఆ ఇంట్లోకి రావాలని రేఖ, రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ తన కూతురిని ఎత్తుకొని ఎమోషనల్ అవుతాడు. తరువాయి భాగంలో అప్పు, కళ్యాణ్ ఇద్దరు మినిస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. తిరిగి వెళ్ళిపోతుంటే మినిస్టర్ ఇంట్లో నుండి రుద్రాణి వెళ్లడం అప్పు మిర్రర్ లో చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



