demon pavan vs kalyan : ఎంటర్‌టైన్‌మెంట్ లో డీమాన్ పవన్ టాప్.. కానీ ఓటింగ్ లో కళ్యాణ్ తోప్!
on Dec 17, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో చివరి వారం కొనసాగుతుంది. మరో నాలుగు రోజుల్లో ఈ సీజన్ ముగుస్తుంది. ఇక ప్రస్తుతం టాప్-5 హౌస్ లో ఉన్నారు. ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్ పడాల, సంజన ఈ అయిదుగురు మాత్రమే మిగిలారు.
బిగ్‌బాస్ సీజన్-9లో టాస్కులు అనగానే ది బెస్ట్ ఇచ్చే వారిలో మొదటి పేరు ఖచ్చితంగా డీమాన్ పవన్‌దే అయి ఉంటుంది. ఎందుంకంటే ఫిజికల్ టాస్కుల విషయంలో డీమాన్ డామినేషన్ మాములుగా ఉండదు. ఇది ఎన్నోసార్లు ఈ సీజన్‌లో ప్రూ చేశాడు. అందుకే అతను ఇప్పుడు టాప్-5 లో ఉన్నాడు. డీమాన్ తో పాటు ఇమ్మాన్యుయేల్ కూడా అంతే రేంజ్ లో ప్రతీ టాస్క్ గెలుస్తూ వచ్చాడు. మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు. పవరస్త్ర గెలిచాడు. అతడికి టాప్-3 కి అర్హుడు. ఇక సంజన.. తను అసలు ఎందుకు టాప్-5 లో ఉందో ఎవరికీ అర్థం కాదు.. గేమ్స్ ఆడలేదు..పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.. అయిన తను ఇంకా ఉంది అంటే అది బిగ్ బాస్ వల్లనే.. అసలు లెక్క ప్రకారం సంజన సెకెండ్ వీక్ ఎలిమినేషన్ అవ్వాలి. కానీ భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ ముగ్గురు సాక్రిఫైజ్ చేసి తనని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ అయిదుగురిలో విజేత ఎవరని మీరు అనుకుంటున్నారో వారికి మీ ఓట్ వేయండి అని బిగ్ బాస్ చెప్పగా ఆడియన్స్ ఓటింగ్ చేస్తున్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పడాల నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక పది , ఇరవై శాతం ఓటింగ్ ఢిఫరెన్స్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉండగా, డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. సంజన లీస్ట్ లో ఉంది. తాజాగా రిలీజైన బిగ్ బాస్ ఎపిసోడ్ లలో డీమాన్ పవన్ ఎంటర్‌టైన్‌మెంట్ కా బాప్ అన్నట్టుగా పంచులు వేస్తున్నాడు. అందరిని నవ్విస్తున్నాడు. జెన్యున్ గా చెప్పాలంటే డీమాన్ పవన్ కి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అతను ఎక్కడో ఆగిపోయాడు. కాదు కాదు రీతూ వెనుక పడి మిగిలిపోయాడు. అందుకే టైటిల్ రేస్ లో వెనుకబడిపోయాడు. టాప్-5 లో ఎవరికి మీ ఓట్ అని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



