400 కే ఫాలోవర్స్ అయ్యారోచ్ ..కేరళ అందాల మధ్య బ్రహ్మముడి కావ్య...
on Apr 29, 2025

బుల్లితెర మీద నటించేవాళ్ళు రెగ్యులర్ గా కొంత బ్రేక్ తీసుకోకపోతే వాళ్ళు మాత్రం చాలా స్ట్రెస్ ఫీలవుతూ ఉంటారు. అందుకే కొంత టైం తీసుకుని వాళ్ళు ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా రంగరాజు అలాగే వెళ్ళింది. ఎప్పుడూ షోస్ అంటూ ఆమె అందులోనే గడిపేస్తోంది. ఐతే ఇప్పుడు కొంచెం రిలాక్స్ కావాలనుకుంది. దాంతో ఆమె కేరళలో ఉన్న వాగమోన్ అనే పచ్చని అందాలు అలరారే ప్రాంతానికి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఒక మెసేజ్ ఐతే పెట్టింది అది కూడా భలే వెరైటీగా పెట్టింది. దీపికా చూడడానికి ఎంత క్యూట్ గా ఉంటుందో ఆమె మెసేజెస్ క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ తో ఫన్నీగా ఉంటాయి.
"రిఫ్రెష్మెంట్ కోసం మూడు రోజుల ట్రిప్ వేస్తే ఆ ట్రిప్ బడలిక తీరడానికి మరో వారం రోజుల సెలవు తీసుకుని మరీ రిఫ్రెష్ అవ్వాల్సి వస్తుంది" అంటూ భలే కామెడీగ పెట్టింది. ఇక నెటిజన్స్ ఐతే ఆమె పెట్టిన ఈ పోస్ట్ కి "నీ క్లారిటీకి, నీ ఎక్స్ప్లనేషన్ కి, నీ క్యూట్ నెస్ కి టేక్ ఆ బో" అంటున్నారు. ఇక దీపికా మరో పోస్ట్ కూడా తన స్టేటస్ లో పెట్టింది. అదేంటంటే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 400 కే ఐనందుకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక థ్యాంక్యూ ఫ్రెండ్స్ అంటూ కూడా చెప్పింది. ఇక దీపికా డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రీ ఫైనల్స్ వరకు వచ్చేసింది. అసలు దీపికా నాన్ సింక్ డాన్సర్. అసలు డాన్స్ డాన్స్ రాదు కానీ మెంటార్ ఐపోయింది. ఆమె కంటెస్టెంట్ మాత్రమే ఇరగదీసేస్తూ ఉంటాడు. ఇక చెఫ్ మంత్ర షోలో కూడా ఆమె సమీరా భరద్వాజ్ కి జోడీగా వచ్చింది. వంట కూడా పెద్దగా రాకపోవడంతో మార్క్స్ తగ్గిపోయి ఆ జోడి ఎలిమినేట్ ఐపోయింది. ఇలా అటు సీరియల్స్ లో ఇటు అన్ని షోస్ లో ఆమె కామెడీ టైమింగ్ తో ఆ షోస్ లో మెరుస్తూ ఉంది. ప్రోమోస్ లో కూడా దీపికానే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



