Karthika Deepam2 : కార్తీక్ కి ఫోన్ చేసిన దాస్.. జ్యోత్స్న పని అయిపోయినట్టేనా!
on Jan 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -574 లో.....శివన్నారాయణ ప్రొద్దున్నే సూర్య నమస్కారం చేస్తుంటే పారిజాతం వచ్చి తన ముందు ఉంటుంది. ఛీ నువ్వు ఎందుకు వచ్చావని కోప్పడతాడు. సుమిత్ర, దశరథ్ ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడే దీప, శౌర్యలని తీసుకొని వస్తాడు కార్తీక్. మీ అమ్మ ఎక్కడ అని శివన్నారాయణ అడుగుతాడు. తనకి ధైర్యం సరిపోవడం లేదట రాలేను అందని కార్తీక్ చెప్తాడు. పాపం జ్యోత్స్న పరిస్థితి కూడా అలాగే ఉంది రా.. గదిలో నుండి బయటకు రావడం లేదని పారిజాతం అంటుంది. నేను రప్పిస్తా కదా అని కార్తీక్, జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు.
దీప ఈ రోజు మన ఇంట్లో విందు భోజనం అరెంజ్ చెయ్ అని దశరథ్ అనగానే ఎందుకు ఎవరు వస్తున్నారని దీప అడుగతుంది. మన ఇంట్లో పండుగ అనుకోమని దశరథ్ అంటాడు. జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళ్లి తన మాటలతో చిరాకు తెప్పిస్తాడు. దాంతో జ్యోత్స్న బయటకు వెళ్తుంటే ఎక్కడికి అమ్మాయి గారు అని దీప అడుగుతుంది. ఎక్కడికి వెళ్లినా నీకు మీ ఆయనకి చెప్పాలా అని జ్యోత్స్న అంటుంది. ఈ రోజు మన ఇంట్లో విందు భోజనం ఉంది. భోజనం టైమ్ కి, డిన్నర్ టైమ్ కి వస్తారా అని దీప అంటుంది. నేను రెండు రోజుల వరకు రానని జ్యోత్స్న అనగానే.. అప్పుడే సుమిత్ర ఎంట్రీ ఇచ్చి రెండు రోజులు రానంతగా ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. నేనే ఇంట్లో ఉంటే బాధగా ఉంటుందని కాసేపు సరదాగా బయటకు వెళ్ళమని చెప్పానని పారిజాతం అంటుంది.
నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదు.. నువ్వు నా కళ్ళముందే ఉండాలని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. ఇక జ్యోత్స్న ఏం చెయ్యలేక ఇంట్లోనే ఉంటుంది. మరొకవైపు దాస్ కి రౌడీ టిఫిన్ తీసుకొని వస్తాడు. రౌడీ బయటకు వెళ్ళగానే దాస్ తన ఫోన్ పక్కన ఉంటే తీసుకొని కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. రౌడీ రాగానే కట్ చేస్తాడు. దాస్ ఫోన్ తీసుకున్న విషయం రౌడీకి తెలిసి లాక్కుంటాడు. కార్తీక్ మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఏమైందని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత రౌడీలని దాస్ కొట్టి బయటకు వచ్చి డోర్ పెడతాడు. జ్యోత్స్న వస్తున్నా ఇక నీ గురించి నిజం దాగదని అనుకుంటాడు దాస్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



