వామ్మో...ఈమె బెల్లీ శశిరేఖ...మాయాబజార్ పాటని ఇలా ఖూనీ చేసారేమిటి ?
on Apr 15, 2025
కాలం మారుతోంది.. బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కలర్ లోకి మార్చి మళ్ళీ రిరిలీజ్ లు చేస్తున్నారు. ఇక క్లాసిక్స్ విషయానికి వస్తే నిజంగా వాటిని కలర్ లో చూడడం కొంత అదృష్టం అనే చెప్పాలి. కానీ ఏకంగా అందులో డాన్స్ లు పాటలను మార్చేస్తే మాత్రమే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మాయాబజార్ మూవీలో మహానటి సావిత్రి శశిరేఖ గెటప్ లో చేసిన నృత్యం మొత్తాన్ని మార్చేసింది అన్షికా..మాయాబజార్ మూవీ ఒకెత్తు ఐతే అందులో సావిత్రి చేసిన "అహ నా పెళ్ళంటా" అనే సాంగ్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి పాటకు డాన్స్ ని రీమిక్స్ చేసేసింది. ఆ మూవీలో మహానటి సావిత్రి నిండైన వస్త్రాలతో ఎంతో అందంగా డాన్స్ చేసింది. కళ్ళు మూసుకున్నా కూడా ఆమె డాన్స్ మైండ్ లో అలా రోల్ అవుతూనే ఉంటుంది. ఐతే ఇప్పుడు డాన్స్ ఐకాన్ షోలో ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ ఈ డాన్స్ ని ఆమెకు నచ్చినట్టు చేసేసింది. ఇక ఈ షోకి సారంగపాణి జాతకం మూవీ టీమ్ వచ్చింది.
ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈమె డాన్స్ చూసి "చాలా కొత్తగా అనిపించింది నాకు..ఇలా కూడా ఊహించొచ్చా ఈ పాటను.. ఈమె బెల్లీ శశిరేఖ" అంటూ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే క్లాసిక్స్ ని ఇలా రిమిక్స్ చేయడం కంటే ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయాలి... కానీ ఇలా అరకొర దుస్తులతో ఇలాంటి పాటను అసలు అవమానించకూడదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "ఆ పాట ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి అక్కడ మ్యూజిక్ ఏంటి వాళ్ళు వేసే స్టెప్స్ ఏంటి సంబంధం వుండక్కర్లా..ఆ పాట స్థాయి ఏంటి ఇక్కడ ప్రెజంట్ చేస్తున్న విధానం ఏంటి..శశిరేఖ లాంటి పాత్ర మన ఇండస్ట్రీకి సిగ్నేచర్ రోల్. ఆ పాటను పట్టుకుని ఖూనీ చెయ్యడం ఏంటో..దానికి పొగడ్తలేంటో.. " అని కూడా తిడుతున్నారు అభిమానులు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
