ఇంట్లో ఎవరూ లేరు రమ్మనమని సుధీర్‌కు రష్మీ ఫోన్ చేస్తే...
on Jul 15, 2021
సుధీర్‌కి రష్మీ ఫోన్ చేసింది. ప్రేమగా 'అరే... ఎం చేస్తున్నావ్?' అని అడిగింది. 'ఏం చేయడం లేదు. ఖాళీగా ఉన్నాను' అని చెప్పాడు. అప్పుడు 'అరే... ఇంట్లో ఎవరూ లేరు' అని చెప్పింది. ఇంటికి రమ్మని హింట్ ఇచ్చింది. అయితే సుధీర్ ఏమీ తెలియనట్టు అమాయకుడిగా నాకెందుకు ఫోన్ చేశావ్ అన్నట్టు అడిగాడు. 'ఎదవ సోది ఆపి ఇంటికి రా' అని రష్మీ ఆర్డర్ వేసింది. వాయిస్‌లో బేస్ పెంచింది. మామూలుగా అయితే ఎప్పుడూ రష్మీకి లైన్ వేసే సుధీర్, తన ఇమేజ్‌కు భిన్నంగా ప్రవర్తించాడు.
'ఇంటికా? రష్మీ.. ప్లీజ్ రష్మీ. నన్ను వదిలేయ్. మాటొస్తే ఇంటికి రా.. ఇంటికి రా అని ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావ్.' అని సుధీర్ అన్నాడు. దాంతో ఒక్కసారిగా అందరూ పగలబడి నవ్వారు. ఊహించని సమాధానంతో రష్మీ నోరెళ్లబెట్టింది. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ బుధవారం టెలికాస్ట్ కాబోయే 'ఢీ' ఎపిసోడ్‌లో చూడాలి.
సుధీర్‌కి రష్మీ ఫోన్ చేయడం మాత్రమే కాదు... ఆదికి దీపిక కూడా ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పక ముందే 'మనకు అన్ని సంవత్సరాల కెమిస్ట్రీ లేదు గానీ... తొందరగా కానిచ్చేద్దాం' అని ఆది రిప్లై ఇచ్చాడు. 'నాన్నగారు ఇంట్లో లేరు, ఇంటికి వస్తావా?' అని అడిగితే 'వెంటనే ఇంటికి వస్తా' అన్నాడు. మొత్తం మీద ప్రోమో కామెడీతో, కలర్‌ఫుల్ డాన్స్‌లతో సాగింది. ఒక కంటెస్టెంట్‌తో రష్మీ డాన్స్ చేయడం విశేషం.
Also Read