నా జీవితంలో కలర్ ఫుల్ డేస్ అంటే అవే..
on Jan 25, 2025
చలాకి చంటి అంటే చాలు ఒకప్పటి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. అప్పటిలో ధన్ రాజ్, చంటి, వేణు వండర్స్ వీళ్లంతా టీమ్ గా ఉండేవాళ్లు. ఇక ఇప్పుడు చంటి అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఐతే రీసెంట్ గా నూకరాజు చంటితో చిన్న చిట్ చాట్ చేసాడు. ఆ విషయాలు చూద్దాం. "నా ఫస్ట్ సినిమా నా ఫస్ట్ యాక్షన్ షాట్ జల్లు అనే మూవీ. నేను, ధన్ రాజ్, చిత్రం శీను, గ్రేట్ కమెడియన్ ఎంఎస్ నారాయణ గారితో కలిసి చేశా. నాకు డైలాగ్ చెప్పాలంటే ఫస్ట్ టైం కదా భయంగా ఉంది. అప్పుడు నారాయణ గారు పక్కకు తీసుకెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అందులోనూ క్లోజ్ షాట్ దొరకడం చాల అదృష్టం. సినిమా ఆడినా ఆడకపోయినా ఒక్కసారి ఎవరైనా చూసినా కూడా నువ్వు ఎప్పటికీ ఈ ప్రపంచానికి గుర్తుండిపోతావ్ అన్నారు.
అది ఫస్ట్ కలర్ ఫుల్ డే. ఇక జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో ఫస్ట్ డే ఫస్ట్ స్కిట్ నేను గెలవడం నేనే కాలు పెట్టి స్టార్ట్ చేయడం అనేది సెకండ్ కలర్ ఫుల్ డే. ఇక నా పెళ్లి థర్డ్ కలర్ ఫుల్ డే. నా పెద్ద కూతురు పుట్టిన రోజు నా ఫోర్త్ కలర్ ఫుల్ డే. వేరే వాళ్ళు మనకు కాంపిటీషన్ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎవరి ట్రాక్ వాళ్ళది. లైఫ్ లో లేటుగా మెట్లెక్కే వాడే లాస్ట్ వరకు నిలబడతాడు. ఇక నాకు రష్మీ అంటే ఇష్టం. రెండేళ్ల క్రితం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక డబ్బుల కోసం బాగా ఇబ్బంది ఒక అబ్బాయికి ఫోన్ చేసి హెల్ప్ అడిగితె అబ్బా ఒక గంట ముందు ఫోన్ చేయాల్సింది అన్నాడు అంటే ఇక అతనికి ఫోన్ చేయకూడదు అన్న విషయం తెలుసుకున్నా . అలాంటి శ్యాడ్ డే జీవితంలో ఎవరికీ రాకూడదు అతనికి కూడా రాకూడదు అని ఆ దేవుడిని ప్రార్ధించా" అన్నాడు చలాకి చంటి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
