ఎంగేజ్మెంట్ నాతో ఐతే పెళ్లి అమరతో ఉన్నట్టుంది నాకు...విష్ణుప్రియని మిస్ అవుతున్నాం...
on Mar 31, 2025
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. షోకి వస్తూనే సుప్రీత యాదమ్మ రాజుతో కలిసి "ఊ అంటావా మావ" సాంగ్ కి మంచిగ డాన్స్ చేస్తూ వచ్చింది. కానీ ఇంతలో అమరదీప్, అంబటి అర్జున్ వచ్చి యాదమ్మ రాజును పక్కకు నెట్టేసి వాళ్ళు డాన్స్ చేశారు. సుమ ఈ సీన్ చూసి "యాదమ్మరాజు సూపర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ " అని కాంప్లిమెంట్ ఇవ్వడంతో రాజు కుళ్లిపోయాడు. "ఎంగేజ్మెంట్ నాతో ఐతే పెళ్లి అమరదీప్ తో ఉన్నట్టుంది నాకు" అంటూ అనకూడని మాట అనేశాడు. తర్వాత ప్రసాద్ బెహరా వచ్చాడు. "ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి జంటలను చూడడం తప్ప ఫస్ట్ టైం స్టేజి మీద మీలాంటి జంటను చూస్తున్నా అర్జున్ అండ్ అమరదీప్" అనేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాకయ్యారు ఆ మాటకు అర్ధం తెలీక.
మలబార్ పరోటా, పన్నీర్ బటర్ మసాలా చేయాలి అంటూ సుమ టాస్క్ ఇచ్చేసరికి "అది ఏ బార్ లో దొరుకుతుంది" అంటూ దీపికా అడిగింది . దాంతో అందరూ నవ్వేశారు. తర్వాత "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" మూవీ ప్రొమోషన్స్ కోసం ప్రదీప్ - దీపికా పిల్లి వచ్చారు. కంటెస్టెంట్స్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ని దీపికా-ప్రదీప్ టేస్ట్ చేశారు. అమరదీప్ దగ్గరకు వచ్చేసరికి పన్నీర్ కర్రీలో పసుపు కొంచెం ఎక్కువయ్యింది అని దీపికా పిల్లి చెప్పింది. "పసుపు యాంటిబయోటిక్" అని చెప్పబోయాడు వెంటనే ప్రదీప్ అందుకుని "అది ఆంటీబయోటిక్ కాదు యాంటిబయోటిక్" అని కరెక్షన్ చేసి మరీ నవ్వించాడు. ఫైనల్ గా యాదమ్మ రాజు గుమ్మడికాయ తెచ్చి మీ సినిమాకు దిష్టి తీయాలి అంటూ చెప్పాడు. ప్రదీప్ ఆ మూవీ పేరు చెప్పు అనేసరికి "అక్కడ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి" అన్నాడు. దాంతో ప్రదీప్ కూడా సినిమా టైటిల్ కన్ఫ్యూజ్ చేసేసాడు అంటూ చెప్పి నవ్వించాడు. ఇక నెటిజన్స్ ఐతే విష్ణుప్రియ కావాలి, ఆమెను చాలా మిస్ అవుతున్నాం అని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
