Home

»

Tv News

Podharillu : కేశవ, చక్రిల మధ్య గొడవ..కారణం తనే అనుకుంటున్న మహా!

Mar 04, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -62 లో..... మహాకి చక్రి అబద్ధం చెప్పడని తెలియడంతో తనపై కోప్పడుతుంది. చక్రి తో మాట్లాడటానికి కూడా ఇష్టపడదు. దాంతో అనవసరంగా నిజం చెప్పాడని మాధవపై కోప్పడుతాడు. వీడు పెళ్లి చేసుకొని ఎలా సంతోషంగా ఉంటాడు.. మాలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉండాలని ఇలా చేశారు కదా అని చక్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే.. కేశవకి కోపం వస్తుంది. దాంతో చక్రి, కేశవలకి గొడవ అవుతుంది. మధ్యలో మాధవ వెళ్లినందుకు తనకి దెబ్బ తగులుతుంది. అప్పుడే కన్నా, మహా వస్తారు. ఏంటి అన్న అన్నయ్యని కొట్టావని చక్రిని కన్నా అడుగుతాడు.

మహా కోపంగా లోపలికి వెళ్తుంది. అన్నయ్యని కొట్టానని చక్రి తన చెయ్ ని చెట్టుకేసి గుచ్చుకుంటాడు. మరొకవైపు మీ అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి నేనే కారణమని మహా ఫీల్ అవుతుంటే.. అలా ఏం కాదని మాధవ చెప్తాడు. ఆ తర్వాత చక్రి దగ్గరికి మాధవ వెళ్తాడు. తన చెయ్ కి ఉన్న గాయం చూసి కట్టుకడతాడు. సారీ అన్నయ్య అని చక్రి బాధపడుతాడు. ఒరేయ్ నువ్వు ఏం కావాలని చెయ్యలేదు కదా అని మాధవ అంటాడు. ఆ తర్వాత మహా దగ్గరికి నారాయణ వచ్చి పేపర్ లో చుట్టి పల్లి పట్టి తీసుకొని వచ్చి మహాకి ఇస్తాడు. ఆ పేపర్ లో టూలెట్ అని ఒక నెంబర్ ఉంటుంది. అది చూస్తుంది. మరుసటి రోజు ఆ పేపర్ పట్టుకొని బయటకు వెళ్తుంటే కత్తిని నూరుతు నారాయణ కన్పిస్తాడు. అతన్ని చూసి తాయారు అన్న మాటలు గుర్తుచేసుకొని మహా భయపడి లోపలికి వెళ్తుంది. మహా కంగారు పడడం చూసిన మాధవ.. ఏమైందని బయటకు వచ్చి చూస్తాడు.

నారాయణ కత్తి నూరడం చూసి భయపడిందని అర్థం చేసుకుంటాడు. ఏంటి నాన్న ఇది మహాలక్ష్మి భయపడుతుందని మాధవ అంటాడు. తనకి కొబ్బరి బొండాలు కొట్టడానికి అని నారాయణ చెప్తాడు. నారాయణ ఎవరితోనో గొడవ పడడం చూసి మహా భయపడి వెంటనే ఇంట్లో నుండి వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత మహా రూమ్ చూడడానికి వెళ్తుంది. అక్కడ రూమ్ నచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తుంది. తరువాయి భాగంలో కన్నా ఎగ్జామ్ రాయడానికి వెళ్తు.. మహా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత మహా తను చూసుకున్న రూమ్ దగ్గరికి చక్రి దింపడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com