Home

»

Tv News

Brahmamudi: త్వరలో కంపెనీ మూతపడబోతుంది.. ఐశ్వర్యకి షాక్ ఇచ్చిన పీఏ!

Nov 11, 2026 9:30AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1185 లో.. రాజు తెచ్చిన ఇందిరాదేవి, సీతారామయ్య ఫోటో విషయంలో దుగ్గిరాల ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ ఫోటో ఎక్కడ పెడతావని రేఖ నిలదీస్తుంది. స్టెప్స్ దగ్గర ఉన్న రుద్రాణి, రాహుల్ ఫోటోలు తీసేసి అక్కడ పెడతాడని సుభాష్ చెప్పడంతో, రేఖ కోపంగా ఆపబోతుంది. దానికి సుభాష్.. ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నరరూప రాక్షసుల ఫోటోలు రోజూ చూడాలా అంటూ ఎమోషనల్ అవుతాడు. వెంటనే రాజు వచ్చి ఎవరైనా ఆపుతారా అంటూ రుద్రాణి, రాహుల్ ఫోటోలు తీసేసి ఇందిరాదేవి ఫోటో పెడతాడు. దీంతో రేఖ, భ్రమరాంబ, ఐశ్వర్య అవమానంతో వెళ్లిపోతారు.

ఆ తర్వాత రూంలో సుభాష్, అపర్ణ రాజుని చూసి ఎమోషనల్ అవుతారు. ఇన్నాళ్లు ఆస్తి ఉన్నా పనిమనుషుల్లా బతికామని, తిండి తినడానికి కూడా పర్మిషన్ కావాల్సి వచ్చేదని కన్నీరు పెడతారు. ఇవాళ ఆ ఫోటో పెట్టడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయని చెప్తారు. మరోవైపు లక్కీ, భూషణ్ తీసేసిన ఫోటోలను రేఖ రూంలో పెడతారు. వాటిని చూసి రేఖ ఏడుస్తూ.. ఇది ఏడుపు కాదు, రాజు చావు కోసం నేను చేసే ఆక్రందన అంటూ.. ఆ రాజు గాడిని చంపేస్తే గానీ మనకు ఆస్తి దక్కదని ప్లాన్ వేస్తుంది. ఈ విషయం రాజుకు చెప్తే బాగోదని శేషుకు వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు ఇందు, నందు వెంకీకి తమ కంపెనీలో జాబ్ ఇప్పించాలని రాజును చలపతి దగ్గరకు పంపిస్తారు. కానీ చలపతి.. వాడు ఏదో ఒకటి చేసుకుని మా దగ్గరే ఉంటాడు.. కంపెనీలో జాబ్ ఇవ్వను అంటూ రాజును పంపించేస్తాడు.ఆఫీసులో ఐశ్వర్యకు పీఏ షాక్ ఇస్తాడు. త్వరలో కంపెనీ మూతపడబోతుందని, అందుకే వేరే జాబ్ చూసుకుంటున్నానని చెప్తాడు. దీంతో ఐశ్వర్య పార్వతీశం మీద కోపంతో జ్యూవెలరీ ఎక్స్‌పోలో పాల్గొనాలని నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com