Home

»

Tv News

రాజు ఊహల్లో ఇందు ముద్దులు.. రేఖకు షాకిచ్చిన ఐశ్వర్య!

Jun 14, 2026 9:07AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1058 లో..... నా భార్యకి చదువు రాదని మోసం చేస్తున్నారా.. ఆ డీలింగ్ పై ఇందు సంతకం చేస్తే కంపెనీ నష్టాల్లోకి వెళ్తుందని రాజు అంటాడు. ఇందు కావాలనే యాక్టింగ్ చేస్తుంటుంది. అంటే ఏంటి.. ఇప్పుడు మా రేఖ ఆంటి మోసం చేస్తుందని అంటున్నావా అలా ఏం చేయదు.. మా ఆంటీ ఎక్కడ సంతకం చెయ్యమంటే అక్కడ చేస్తానని ఇందు అంటుంది‌ అయితే రేపు ప్రొద్దున చార్టెడ్ అకౌంటెంట్ ని పిలిచి ఈ డీల్ గురించి చెప్పమని చెప్పండి.. అప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదంటే సంతకం పెట్టడానికి అడ్డుచెప్పనని రాజు అంటాడు. దాంతో రేఖ టెన్షన్ పడుతుంది.

ఇక నుంచి ఇందు ఏం సంతకం చెయ్యాలన్నా ముందు దాన్ని నేను చూడాలి.. ఆ తర్వాత సంతకం అని ఆ డీలింగ్ పేపర్స్ ని రాజు చింపేస్తాడు. ఆ తర్వాత శేషుని భ్రమరాంబ పక్కకి తీసుకొని వెళ్తుంది. నువ్వు వాడితో కలిసి తాగి ఆ ఇందుని చదవమని పట్టు పట్టావు.. ఆ రాజు గాడు వచ్చి మొత్తం ప్లాన్ ఫెయిల్ చేసాడని భ్రమరాంబ తనపై కోప్పడుతుంది. మరొకవైపు వెంకీ డెలివరీ బాయ్ గా జాయిన్ అవ్వడానికి రెడీ అవుతాడు కానీ మళ్ళీ సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందని ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో వాళ్లకి వెంకీ నిజం చెప్పడు. ఆ తర్వాత ఇందు తనకి హెల్ప్ చేసినందుకు  నా దగ్గర వచ్చి థాంక్స్ రాజు ని చెప్తుందని రాజు అనుకుంటాడు. ఇందు వచ్చి రాజు ని హగ్ చేసుకొని థాంక్స్ రాజు ఐ లవ్ యూ అని చెప్తుంది . దాంతో రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇందుకి రాజు ముద్దు పెడుతున్నట్లు ఉహించుకుంటాడు. అప్పుడే ఇందు వచ్చి రాజు ఏం చేసున్నావని అడుగుతుంది. అంత హెల్ప్ చేసాను.. కనీసం థాంక్స్ అయిన చెప్పలేదని రాజు అంటాడు.

ఆ తర్వాత ఇంత హెల్ప్ చేసాను ఎలాగు థాంక్స్ చెప్పలేదు..కనీసం నేను బెడ్ పై అయినా పడుకుంటాను.. నిన్ను టచ్ కూడా చెయ్యనని రాజు రిక్వెస్ట్ చేస్తాడు.‌ కానీ ఇందు వద్దని అంటుంది. దాంతో రాజు తిట్టుకుంటు కిందే పడుకుంటాడు. తరువాయి భాగంలో అసలు రాజు, ఇందు భార్యాభర్తలు కాదని అనిపిస్తుంది.. వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారనిపిస్తుంది ఒకసారి రండి చూపిస్తానని రేఖని తీసుకొని ఐశ్వర్య వాళ్ళ బెడ్ రూమ్ వైపు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com