సెక్యూరిటీచే డీల్ కుదుర్చుకున్న అనామిక.. రాజ్, కావ్యలకి కోట్లలో నష్టం!
on Jan 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -611 లో.....కావ్య, రాజ్ ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి రుద్రాణి మంచిగా కార్ లో షికారుకి వెళ్లి వస్తున్నారా అని అడుగుతుంది. కార్ లో వెళ్ళాం షికారుకి కాదని రాజ్ అంటాడు. వెళ్ళింది భార్య భర్తలం కదా ఎందుకంతా వెటకారంగా మాట్లాడుతున్నారని రుద్రాణితో కావ్య అంటుంది. మీరు వెళ్ళడానికి కార్ కావాలి. ఇంటి దగ్గర ఏదైనా అవసరం వస్తే వెళ్ళడానికి కార్ ఉండాలి కదా.. అసలు కార్లని వద్దని పంపే అధికారం ఎవరిచ్చారని ధాన్యలక్ష్మి అడుగుతుంది.
నాకు సర్వహక్కులు తాతయ్య గారు ఇచ్చారు.. నేను చెప్పిందే వినాలని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. కావ్య అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటని ప్రకాష్ అనగానే.. నాకు పాకెట్ మనీ కావాలన్నా కూడా కావ్యని అడుగుతున్నాను.. నేను ఎవరికి చెప్పుకోవాలని రాజ్ అంటాడు. ఇప్పుడు కావ్య మాట్లాడిన విధానం నాకు నచ్చలేదని సుభాష్ తో ప్రకాష్ అంటాడు .ఆ తర్వాత ఎందుకు అంత దురసుగా మాట్లాడావని రాజ్ అంటాడు. కానీ ఇప్పుడు నిజం చెప్పలేను తప్పలేదు కానీ వాళ్ళకి ఇంకా శత్రువుగా మారిపోతున్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత సుభాష్, అపర్ణ, ఇందిరాదేవిలు కావ్య ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు. ఇలా కావ్య మాట్లాడుతుంటే.. ప్రకాష్ కి ధాన్యలక్ష్మి నూరిపోస్తుంది. దాంతో కుటుంబం ముక్కలవుతుందని ఇందిరాదేవి అంటుంది. మీరే కావ్యతో తన ప్రవర్తన గురించి మార్చుకోమని చెప్పండి అని అపర్ణ, సుభాష్ లకి ఇందిరాదేవి చెప్తుంది. మరొకవైపు నందగోపాల్ ని కొడుతుంది అనామిక. నిన్ను ఎవరికి కన్పించిద్దన్నాను కదా ఎందుకు రాజ్ కంటపడ్డావని అడుగుతుంది. నేను చెప్పినట్టు వినమని అనామిక చెప్తుంది. రాజ్ వాళ్ళ డిజైన్స్ నాకు కావాలని సామంత్ కి అనామిక చెప్తుంది.
ఆ తర్వాత కావ్య డిజైన్స్ వేస్తుంటుంది. రాజ్ తన భుజంపై పడుకోవడంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు అందరు టిఫిన్ చేస్తుంటే కావ్య నీతో మాట్లాడాలని అపర్ణ అనగానే.. నాకు ఇప్పుడు టైమ్ లేదని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది. రాజ్ నీతో మాట్లాడాలని సుభాష్ అనగానే.. నాకూ టైమ్ లేదని రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆఫీస్ లో రాజ్, కావ్య ఇద్దరు నగల డిజైన్స్ చూస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరు భోజనం చేస్తుంటే రాజ్, కావ్య వస్తారు. రండీ భోజనం చెయ్యండి అని అపర్ణ అనగానే టైడ్ అయ్యామంటూ రాజ్, కావ్య వెళ్ళిపోతారు . తరువాయి భాగం లో నగలన్ని రాజ్, కావ్యలు సెక్యూరిటీచే లాకర్ లో పెట్టిస్తారు. ఆ తర్వాత సెక్యూరిటీతో అనామిక డీల్ మాట్లాడుకొని అనామిక నగలు తీసుకొని రమ్మని చెప్తుంది. ఆ ప్లేస్ లో డూప్లికేట్ నగలు పెట్టమని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.