బ్యాంక్ వాళ్ళని ఒప్పించిన కావ్య.. ఇంటి కోడలి భాద్యతల్లో కొత్తగా ఆర్డర్!
on Dec 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -599 లో.... రాజ్ గదిలోకి వచ్చి నీతో మాట్లాడాలని కావ్య చేతులు పట్టుకుంటాడు. కావ్య సిగ్గుపడుతూ.. చెప్పండి అని అంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. నేను ప్రాబ్లమ్ లో ఉన్నాను. దుగ్గిరాల ఇంటి సమస్య అని సీతారామయ్య షూరిటి విషయం రాజ్ చెప్తాడు. కావ్య షాక్ అవుతుంది. మీరేం టెన్షన్ పడకండి నాకు చెప్పి మంచి పని చేశారు. మీ భారం దించుకున్నారు.. ఇద్దరం కలిసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం.. ఆఫీస్ కి రేపు నేను కూడా వస్తానని కావ్య అనగానే కావ్యని హగ్ చేసుకుంటాడు రాజ్.
మరుసటిరోజు కావ్య, రాజ్ ఇద్దరు ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతారు. కావ్య ఆస్తుల పేపర్స్ తీసుకొని వస్తుంటే.. ఎందుకు ఆ ఆస్తులు నావి... దానికి నాకు ఏం సంబంధం లేదని అంటావా అని రాజ్ అంటాడు. నేనెందుకు అలా అంటాను.. నన్ను అర్థం చేసుకుంది అంతేనా.. తాతయ్య మాటను ఎలా తప్పుతాను.. ఈ పేపర్స్ తో అవసరం ఉందని కావ్య అనగానే సారీ అని రాజ్ అంటడు. రాజ్, కావ్య ఇద్దరు కలిసి వస్తుంటే సుభాష్, అపర్ణ లు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫీస్ కి వెళ్తున్నామంటూ బయల్దేరతారు. స్వప్నకి కావ్య తాళాలు ఇచ్చి అవసరం ఉంటేనే ఎవరికైనా డబ్బులు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని రుద్రాణి అనగానే.. ఆఫీస్ కి అని స్వప్న అంటుంది. ఆ తాళాలేంటని రుద్రాణి అడుగగా.. కావ్య బాధ్యతలు నాకు ఇచ్చిందని స్వప్న అంటుంది.ఆ తర్వాత కనకానికి అపర్ణ ఫోన్ చేసి.. నా కొడుకు, కోడలు కలిసిపోయారని చెప్తుంది. దాంతో కనకం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు నిజంగా కలిసి పోయారా? అవసరానికి కలిసిపోయార నిజంగా కలిసిపోతే బంధం బాగుంటుంది. అవసరం కోసమైతే అది అప్పటి వరకే అని కృష్ణమూర్తి అంటాడు.
అ తర్వాత రాజ్, కావ్య లు ఆఫీస్ కి వెళ్తారు. బ్యాంక్ వాళ్లు వస్తారు. మీ డబ్బులు మేము కచ్చితంగా ఇస్తాం కానీ అంత డబ్బు ఒకేసారి అంటే కష్టం మాకు టైమ్ కావాలి ఇన్స్టాల్ మెంట్ లో ఇస్తామని కావ్య అనగానే.. మొదట ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత వాళ్ళని కావ్య కన్విన్స్ చేస్తుంది. బ్యాంక్ వాళ్లు ఒప్పుకోవడంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో రుద్రాణికి స్వప్న డబ్బు ఇస్తుంటే.. కావ్య వచ్చి అక్క అవసరం ఉంటేనే ఇవ్వమని అంటుంది. ఇప్పటి నుండి ఇంట్లో వాళ్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారో నాకు రిసీప్ట్ లు కూడా కావాలి. ఇది నా ఆర్డర్ అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read