Brahmamudi : కావ్య ఆ సాక్ష్యం తీసుకురాగలదా.. అత్తని ఆడుకున్న కోడలు!
on Apr 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -687 లో..... స్వప్న ఒంటరిగా ఏదో ఆలోచిస్తుంటే అప్పుడే అప్పు వచ్చి ఏమైంది అక్క అంతలా ఆలోచిస్తున్నావంటుంది.. మా అత్త కావ్య పరిస్థితిని వాడుకొని తనని పిచ్చి దానిలాగా చూపించాలనుకుంటుంది. తనకి ఎలా బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నానని స్వప్న అంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నరు కదా వాళ్ళే చూసుకుంటారని అప్పు అంటుంది. ఈ రాహుల్ తోడు ఉండడం వళ్ల మా అత్త ఇంకా రెచ్చిపోతుందని స్వప్న అంటుంది.
రాహుల్ ని బయటకు పంపించి మా అత్త సంగతి చెప్పాలని తన ఫోన్ నుండి రాహుల్ కి ఫోన్ చేసి ఎవరో అమ్మాయిలాగా మాట్లాడుతుంది. నిన్ను కలవాలని అనగానే కలుస్తాను.. నేను సింగిల్ నే అని రాహుల్ ఫోన్ లో ఫ్లర్ట్ చేస్తుంటాడు. ఆ తర్వాత రాహుల్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని అంటుంది. ఏదో ఒకటి చెప్పి రాహుల్ వెళ్ళిపోతాడు. మాక్కావల్సింది కూడా అదే అని స్వప్న, అప్పు ఇద్దరు అనుకుంటారు. ఆ కళావతి సడెన్ గా ఎందుకు వెళ్ళిందని రాజ్ ఆలోచిస్తాడు . కావ్యకి మెసేజ్ చేస్తాడు. ఇద్దరు కాసేపు చాట్ చేసుకుంటారు. ఆ తర్వాత కాల్ మాట్లాడుకుంటారు. ఫోన్ కట్ చేసి పక్కకి చూసేసరికి యామిని ఉంటుంది. ఏంటి ఇలా సడెన్ గా వచ్చావని రాజ్ అంటాడు. ఇక నీ ప్రైవసీకి అడ్డు రాను.. నీకు నచ్చినట్టు ఉండు.. ఇదిగో కార్ కీస్ అని రాజ్ కి యామిని కీస్ ఇస్తుంది.
కావ్య తమ పెళ్లి ఫోటో చూస్తూ ఏడుస్తుంటుంది. అప్పుడే సుభాష్ వస్తాడు ఏంటి అమ్మ కావ్య ఎన్ని రోజులు ఇలాగే ఉంటావని అడుగుతాడు. అంటే మరి మీరు కూడ రుద్రాణి గారి మాటలు నమ్ముతున్నరా అని కావ్య అంటుంది. రాజ్ ఉంటే ఎక్కడ ఉన్నాడని సుభాష్ అడుగుతాడు. ఇప్పుడు చెప్పలేనని కావ్య అనుకుటుంది. రాజ్ లేడని అనడానికి సాక్ష్యం ఉంది.. ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఉందా అని సుభాష్ అడుగుతాడు. ఆ తర్వాత కావ్య, అప్పు ఇద్దరు రుద్రాణి ని ప్రాంక్ చెయ్యడానికి రెడీ అవుతారు. టేబుల్ పై లైవ్ ఫిష్ పెడతారు. అది చూసి రుద్రాణి భయపడుతుంది. చాపల పులుసు బాగుంటుందని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
