Brahmamudi : భార్య ముందే రాజ్ ని హగ్ చేసుకున్న యామిని.. షాక్ లో ఆ ఇద్దరు!
on Mar 30, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -682 లో... యామిని వాళ్ళ నాన్నకి హార్ట్ ఎటాక్ రావడంతో రాజ్ హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. నాకు నా కూతురు పెళ్లి గురించి టెన్షన్ గా ఉందని యామిని వాళ్ళ నాన్న అంటాడు. మీరేం టెన్షన్ పడకండి అంకుల్ అని రాజ్ అంటాడు. నా కూతురిని పెళ్లి చేసుకుంటానని మాటివ్వమని రాజ్ తో అతను అంటాడు.
మరొకవైపు కావ్య, అప్పు ఇద్దరు అదే హాస్పటల్ కి డాక్టర్ దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి డాక్టర్ నర్స్ తో రొమాన్స్ చేస్తుంటాడు. కావ్య వాళ్ళు వెళ్ళగానే డాక్టర్ నర్సుని పంపిస్తాడు. రాజ్ గురించి కావ్య అడుగగా మాకేం తెలియదని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదో.. నువ్వు ఇందాక నర్స్ తో చేసిన రొమాన్స్ వీడియో తీసాను.. ఇది నీ పెళ్ళాంకి చూపిస్తానని అప్పు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో బయపడి డాక్టర్ అసలు నిజం చెప్తాడు. రాజ్ ఆక్సిడెంట్ వల్ల గతం మర్చిపోయాడు.. దాన్ని అవకాశంగా తీసుకొని యామిని వాడుకుంటుంది. ఆమెనే అసలైన సూత్రధారి.. నేను కేవలం పాత్రదారిని మాత్రమే అని డాక్టర్ చెప్తాడు. ఇక అసలు నిజం తెలుసుకున్న అప్పు, కావ్య.. అతను రాజే అని కన్ఫమ్ చేసుకుంటారు.
మరొకవైపు యామిని వాళ్ళ నాన్నకి యామినిని పెళ్లి చేసుకుంటానని రాజ్ మాటిస్తాడు. ఇక రాజ్ వెళ్లిపోయాక ప్లాన్ సక్సెస్ అంటూ యామిని, వైదేహి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు చూసావా అప్పు.. నా నమ్మకం నిజం అయిందని అప్పు, కావ్య మాట్లాడుకుంటారు. అప్పుడే రాజ్ ఒక దగ్గరికి వస్తాడు. అప్పుకి రాజ్ ని చూపిస్తుంది కావ్య. అప్పు రాజ్ ని చూసి షాక్ అవుతుంది. ఇంకేంటి అక్క తాను బావే కదా వెళ్లి జరిగిందంతా చెప్పమని అప్పు అంటుంది. కావ్య వెళ్తుంటే రాజ్ దగ్గర కి యామిని వచ్చి హగ్ చేసుకొని చాలా థాంక్స్ బావ పెళ్లికి ఒప్పుకున్నందుకని అంటుంది. అదంతా చూస్తున్న అప్పు, కావ్య షాక్ అవుతారు.
తరువాయి భాగం లో కావ్య బాధని చెప్పుకుంటూ దేవుడికి మొక్కుతుంది. నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలని దేవుడికి మొక్కుకుంటుంది. మరొకవైపు నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని యామిని వాళ్ళ నాన్నని రాజ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
