Brahmamudi : యామిని మాయలో రాజ్ పడతాడా.. అతడి దగ్గరికి వెళ్ళిన కావ్య!
on Mar 25, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -677 లో.... రాజ్ ని యామిని తన మాయలో పడెయ్యాడని ప్రయత్నం చేస్తుంది. లేని గతం ని సృష్టిస్తుంది. చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంటూ స్కూల్ కి రాజ్ ని తీసుకొని వెళ్తుంది. అక్కడ ప్రిన్సిపల్ యామినికి ఫేవర్ గా మాట్లాడుతుంది. ఒక ఫోటో చూపించి వీళ్ళందరు మన ఫ్రెండ్స్ అని యామిని చెప్తుంది. నాకేం గుర్తు రావడం లేదని రాజ్ అంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టను గుర్తురాకపోతే వదిలేయ్ అని రాజ్ తో యామిని అంటుంది.
అదంతా కావ్య వింటూ ఉంటుంది. మీకు గతం గుర్తు లేదని తనకి నచ్చిన గతం మీకు చెప్తుంది. మిమ్మల్ని దక్కించుకోవాలని చూస్తుందని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ ని తీసుకొని యామిని ఒక సమాదుల దగ్గరికి తీసుకొని వెళ్తుంది. వీళ్ళే మీ అమ్మనాన్నలు చనిపోయారని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. వాళ్ళని ఫాలో అవుతూ కావ్య వస్తుంది. యామిని చేస్తున్న పనికి కావ్యకి కోపం వస్తుంది. రాజ్ కి ఏదో గుర్తువచ్చినట్లు తలపట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కావ్య, అప్పు ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. ఇక్కడ పెద్ద నాటకం జరుగుతుంది. అంత వచ్చాక చెప్తానని అప్పుతో కావ్య అంటుంది.
మరొకవైపు పేషెంట్ ఎక్కడ అని డాక్టర్స్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. కావ్య కోసం రుద్రాణి డాక్టర్స్ ని పిలిపిస్తుంది. అది తెల్సి సుభాష్ రుద్రాణిపై విరుచుకుపడుతాడు అప్పుడే కావ్య వస్తుంది. డాక్టర్స్ ని సుభాష్ పంపిస్తాడు. రాజ్ ని తీసుకొని వచ్చావా అని రుద్రాణి అడుగుతుంది. రాలేని పరిస్థితిలో ఉన్నారని కావ్య చెప్తుంది. ఇదొక నాటకమా.. నీ వల్ల మా వదిన చూడు ఎలా అయిందోనని కావ్యని తిడుతుంది రుద్రాణి. అయనని త్వరలోనే తీసుకొని వస్తానని కావ్య అనగానే ఎప్పుడని రుద్రాణి అడుగుతుంది. సరిగ్గా నెలలోపు ఆయనని ఇక్కడికి తీసుకొని వస్తానని కావ్య అంటుంది. ఒకవేళ తీసుకొని రాకుంటే అని రుద్రాణి అంటుంది. తీసుకొని రాకుంటే మీరు చేస్తునట్టు ఫోటోకి దండ వేసుకొని దీపం పెట్టండి. ఇంకా నన్ను డాక్టర్స్ కి చూపించండి అని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందని రాజ్ అంటాడు. అలా అనడంతో యామిని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
