Brahmamudi : కార్ నెంబర్ ద్వారా యామిని వివరాలని కావ్య తెలుసుకుంటుందా!
on Mar 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -678 లో.....ఆ కావ్య అంత ఖచ్చితంగా చెప్తుందంటే నిజంగానే రాజ్ బ్రతికి ఉన్నాడు కావచ్చని రుద్రాణి తో రాహుల్ అంటాడు. అది మనకి చెప్పి మంచి పని చేసింది.. ఒకవేళ వాడు బ్రతికున్నా కూడ మనం ఉండనివ్వం కదా అని రుద్రాణి అనగానే.. మనకి రాజ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా అని రాహుల్ అంటాడు. కావ్య ఖచ్చితంగా రాజ్ దగ్గరికి వెళ్తుంది. కావ్య ద్వారా రాజ్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు.. నువ్వు కావ్యపై ఓ కన్నెసి ఉంచమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది.
మరొకవైపు దేవుడికి కావ్య మొక్కుతు బాధపడుతుంది. కావ్య కి సడెన్ గా రాజ్ వెళ్ళిన కార్ నెంబర్ గుర్తు వస్తుంది. ఆ తర్వాత రాజ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే.. చూసారా మీ అల్లుడు గతాన్ని గుర్తుతెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు.. మీరు వెళ్లి డైవర్ట్ చెయ్యండి అని తన పేరెంట్స్ తో యామిని చెప్తుంది. దాంతో యామిని పేరెంట్స్ రాజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఈ రోజు మీ అమ్మాయి మా అమ్మానాన్న సమాధులు అంటూ తీసుకోని వెళ్ళింది కానీ అక్కడ చుస్తే నాకేం గుర్తురాలేదని వాళ్ళతో రాజ్ చెప్తాడు. యామినితో పాటు తన పేరెంట్స్ ఎంత మభ్యపెట్టాలని చూసిన రాజ్ మాత్రం అవేం పట్టించుకోడు. ఆ తర్వాత అప్పు దగ్గరికి కావ్య వెళ్లి.. అయన వెళ్ళిన కార్ నంబర్ ఇది డీటెయిల్స్ కనుక్కోమని చెప్తుంది. అయినా నువ్వు బావని ఒక అమ్మాయితో చూసానన్నావని అప్పు అడుగుతుంది. అవును కానీ ఆయన గతం మర్చిపోయాడు.. అదంతా డీటెయిల్ గా కనుక్కొని చెప్తానని కావ్య అంటుంది.
ఆ తర్వాత అప్పు కార్ నెంబర్ ద్వారా డీటెయిల్స్ కనుక్కొని కావ్య కి చెప్తుంది. కావ్య రెడీ అయి బయటకు వెళ్తుంటే అందరు హాల్లోనే ఉంటారు. ఇలా ప్రతి రోజు వెళ్తే చూసే జనాలు ఏం అనుకుంటారని రుద్రాణి అంటుంది. మీ భర్త మీకు దూరంగా ఉండి ఇరవై సంవత్సరాలవుతుంది అయినా మీరు బానే ఉన్నారు కదా.. నిన్న మొన్న వరకు నా భర్త ఉన్నాడు.. ఇప్పుడు కూడా ఉన్నాడంటే ఎందుకు మీరు నమ్మడం లేదని రుద్రాణికి కావ్య కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
