Brahmamudi: రాజ్ ని యామినితో చూసేసిన కావ్య.. అంతా మాయ చేస్తున్నారుగా!
on Mar 22, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-675 లో.. అప్పూ దారిలో దిగిపోతూ.. అక్కా నువ్వు అనుకున్నట్లుగా ఆసుపత్రిలో ఆరోజు బావ నిన్ను జాయిన్ చేశాడంటున్నావ్ కాబట్టి సమాచారం తెలుసుకో జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. సారీ అక్కా అని కావ్యకు మరీ మరీ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్.. ఆ రోజు నేను కాపాడిన అమ్మాయిని చూస్తే నాకు ఎక్కడో కలిసిన ఫీలింగ్ ఎందుకొచ్చింది. తనని కలిస్తే నా గతం గురించి తెలుసుకోవచ్చేమో.. తను ఆసుపత్రిలో ఉండి ఉంటుందా.. తనని ఎలా కలవాలి.. యామినీకి తెలియకుండానే తన వివరాలు తెలుసుకోవాలని రాజ్ మనసులో ఫిక్స్ అవుతాడు. మరోవైపు యామినీ కూడా కావ్య గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆమెకు డౌట్ ఉంది. రాజ్.. ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు.. ఎందుకు అంత స్పెషల్‌గా ఫీల్ అవుతున్నాడు. కొంపదీసి ఆమె కానీ రాజ్ భార్య అయ్యి ఉంటుందా.. ఎలా అయినా ఈ విషయం రాజ్‌కి తెలియకుండా తెలుసుకోవాలని యామినీ కూడా ఫిక్స్ అవుతుంది. మరోవైపు డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని రాజ్, యామినీ ఇద్దరు ఆసుపత్రి హాల్లో కూర్చుని ఎదురు చూస్తుంటారు. మనసులో మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరు ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు.
రాజ్ వాష్ రూమ్ అని అబద్దం చెప్పి అలా వెళ్లగానే.. యామినీ రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది. రెండు రోజుల క్రితం మా బావ జాయిన్ చేసిన ఆ అమ్మాయి వివరాలు కావాలని అడుగగా.. సరే అని రిసెప్షన్ లో ఉన్న అతను వెతుకుతుంటాడు. అప్పుడే కావ్య ఆ ఆసుపత్రి దగ్గర కారు దిగుతుంది. మరోవైపు రాజ్ చాలా దూరం నుంచి యామినీని గమనిస్తుంటాడు. అయ్యో నేను వెళ్లాల్సిన చోట యామినీ ఉందే.. ఇప్పుడు ఎలా.. అవును ఆ రోజు ఆ అమ్మాయి(కావ్య)కి ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ శ్యామల గారిని కలుద్దామనుకుంటూ రాజ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. యామిని వివరాల కోసం ఆ రిసెప్షన్ లో ఉన్న అతడిని కంగారు పెట్టగా.. అతను సర్వర్ స్లోగా ఉందని చెప్తాడు. సరే అయితే వివరాలు తీసి ఉంచమని చెప్పి రాజ్ దగ్గరికి యామిని వెళ్తుంది. ఇక కాసేపటికి కావ్య వచ్చి రాజ్ వివరాలు అడుగుతుంది. ఆ రిసెప్షన్ లో ఉన్నతను రాజ్ అటువైపు వెళ్ళాడని చెప్తాడు. దాంతో కావ్య అతడిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక రాజ్ ని యామిని చూస్తుంది. తను సెట్ చేసిన డాక్టర్ దగ్గరికి రాజ్ ని తీసుకొని వెళ్తుంది యామిని. అదే సమయంలో రాజ్ ని కావ్య చూస్తుంది.
ఇక యామిని, డాక్టర్ లు మాట్లాడే మాటల్ని కావ్య వింటూ ఉంటుంది. చూడండి రామ్ మీరు ఆరునెలలుగా కోమాలో ఉండటంతో మీ బాడీ రియాక్ట్ అయ్యే విధానం అంతా స్లో అయిపోయింది.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ అంటాడు. డాక్టర్ మాటలు విన్న కావ్య.. అదేంటీ ఆరు నెలలుగా కోమాలో ఉన్నారా.. మొన్నేగా యాక్సిడెంట్ అయ్యింది.. అంటే వీళ్లు ఆయన్ని ఏదో మాయ చెయ్యాలని చూస్తున్నారా అని కావ్య మనసులో అనుకుంటుంది. నాకు గతం తెలుసుకోవాలని ఉంది డాక్టర్.. నేను ఎవరో నాకో క్లారిటీ కావాలి. ఎంత ఆలోచించినా నాకేదీ గుర్తురావడం లేదు.. ఎక్కువ ఆలోచిస్తే నాకు తలనొప్పి వస్తుంది. నాకు త్వరగా గతం గుర్తురావాలి.. ప్లీజ్ ఏదొకటి చేయండి డాక్టర్ అని రాజ్ ఆవేదనగా అంటాడు. ఇదే డాక్టర్ ఇదే.. ఇలాగే క్షణం కూడా రిలాక్స్‌గా ఉండటం లేదు.. మళ్లీ తనకు ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉంది డాక్టర్ అని యామిని అంటుంది. నిజమే యామినీ గారు.. అంత తీవ్రంగా ఆలోచించి గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే మళ్లీ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.. జాగ్రత్తగా ఉండాలి.. రామ్ గుర్తుపెట్టుకోండి అనే డాక్టర్ కూడా నటిస్తాడు. అంతా విని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
