Brahmamudi : కిరిటాన్ని మార్చేసిన కావ్య.. డెమో పీస్ అంటూ కొత్త ప్లాన్ రివీల్!
on Jan 8, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -613 లో.... రాజ్ ని నిద్రలేపడానికి వస్తుంది కావ్య. దాంతో తన మీద పడిపోతుంది. కావ్య రొమాంటిక్ గా రాజ్ ని చూసేసరికి.. పదా ఆఫీస్ కి లేట్ అవుతుందంటూ కంగారుపడతాడు. మార్పు మొదలైంది ప్రేమ మొదలు అయిందని కావ్య మురిసిపోతుంది. ఆ తర్వాత రాజ్ , కావ్య ఆఫీస్ కి బయల్దేర్తారు. దారిలో కావ్య ప్రెజెంటేషన్ ఫైల్ మర్చిపోయానని గుర్తుకు వచ్చి తీసుకొని రావడానికి కార్ దిగి ఆటోలో వెళ్తుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి కి వెళ్లి నగలన్నీ జగదీష్ చంద్ర ముందు పెట్టేస్తాడు.
ఆ తర్వాత కావ్య మేడమ్ రాలేదని అనామికకి సెక్యూరిటీ ఫోన్ చేసి చెప్తాడు. అదేంటి ఎందుకు రాలేదని అనామిక టెన్షన్ పడుతుంది. రాజ్ ఒక్కడే అవమానపడడానికి వీలు లేదు కావ్య కూడా అందులో భాగంగా ఉండాలని అనామిక అనుకొని.. కావ్యకి ఫోన్ చేసి నీ భర్త అక్కడ అవమానపడుతుంటే నువ్వేం చేస్తున్నావ్.. నువ్వు అందులో భాగం ఉండాలి కదా అంటూ మాట్లాడుతుంది. కావ్యకి ఏం అర్ధం కాదు.. దాంతో రాజ్ కి ఫోన్ చేస్తుంది. రాజ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు అన్ని నగలు ఒకే గానీ ఈ కిరీటం బంగారం కిరీటం కాదని క్వాలిటీ చెక్ వారు జగదీశ్ చంద్రతో అంటారు. నా ఫ్రెండ్ మనవడివి అని నమ్మితే ఇంత మోసం చేస్తావా రాజ్ అని జగదీశ్ చంద్ర కోప్పడతాడు.
అప్పుడే కావ్య వచ్చి.. ఏమైందని అడుగుతుంది. ఏం జరిగిందో నీకు తెలియకుండా ఉంటుందా అని జగదీశ్ చంద్ర అంటాడు. ఈ కిరీటం బంగారం కిరీటం కాదని అంటాడు. అవును అది డెమో పీస్ అయిన మర్చిపోయినట్లున్నాడు. అది సెక్యూరిటీ పర్పస్ ఇలా పెడుతామని కావ్య ఒరిజినల్ కిరీటాన్ని ఇస్తుంది. దాంతో తప్పుగా అర్ధం చేసుకున్నానని జగదీశ్ చంద్ర అనగానే.. నాకు కాదు మా అయన కి చెప్పండి అని కావ్య అంటుంది. అదంతా విన్న సెక్యూరిటీ అంటే నేను తీసుకొని వెళ్ళింది కూడా డెమో పీస్ ఆ.. నా యాభై లక్షలు పోయే అంటూ అనామికకి ఫోన్ చేసి మేడమ్ కొంప మునిగింది. అది ఒరిజినల్ కిరీటం కాదని చెప్పగానే అనామిక షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
Also Read