Brahmamudi : తప్పించుకున్న నందగోపాల్.. రాజ్, కావ్య పట్టుకుంటారా!
on Jan 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -610 లో.... కావ్యతో సావిత్రి క్లోజ్ గా ఉంటున్నాడని జెలస్ గా ఫీల్ అవుతాడు రాజ్. ఆ తర్వాత మేము కిడ్నాపర్స్ అంటూ సావిత్రిని భయపెట్టి కార్ దిగి వెళ్లిపోయేలా చేస్తాడు రాజ్. ఆ తర్వాత నందు గాని అడ్రెస్ దొరికిందంట పదా అంటూ కావ్యని తీసుకొని రాజ్ నందగోపాల్ ఫామ్ హౌస్ కి వెళ్తాడు. ఎక్కడికి వెళ్లినా ఈ పాత బంగ్లా గోలేంటి.. ఈ బంగ్లా చూస్తే నాకూ ఏదేదో గుర్తొస్తుందని కావ్య అనగానే.. ఆ పీడకలని ఎందుకు గుర్తుచేస్తావని రాజ్ అంటాడు.
ఆ తర్వాత సెక్యూరిటీతో రాజ్ మాట్లాడతాడు. మేము నందు ఫ్రెండ్స్ తనకి సర్ ప్రైజ్ ఇవ్వాలని వచ్చామంటూ రాజ్ చెప్తాడు. దాంతో సెక్యూరిటీ వాళ్ళని లోపలికి పంపిస్తాడు. మరొకవైపు అత్తాకోడళ్ళిద్దరు ఎక్కడికో వెళ్తున్నట్లున్నారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. హాస్పిటల్ కి అని ఇందిరాదేవి చెప్పాగానే.. ఎలా వెళ్తారు కార్లు లేవ్ కదా అని రుద్రాణి అంటుంది. సుభాష్ వస్తున్నాడు.. వెళ్తామని ఇందిరదేవి అంటుంది. అప్పుడే సుభాష్ వస్తాడు. కార్ ట్రబుల్ ఇచ్చిందని సుభాష్ అంటాడు. అయ్యో ఇప్పుడు ఎలా వెళ్తారు ఆటోకి వెళ్తారా అంటూ రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. నేను క్యాబ్ బుక్ చేస్తానని ప్రకాష్ అంటాడు. మరొకవైపు రాజ్ , కావ్య ఇద్దరు గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తారు. అక్కడ బెడ్ రూమ్ డెకరేషన్ చేసి ఉంటుంది. అది చూసి ఇది మీ ప్లాన్ అయితే కాదు కదా అని రాజ్ తో కావ్య అనగానే.. ఎలా కన్పిస్తున్నానని రాజ్ అంటాడు. కావ్య, రాజ్ లు పొరపాటుగా బెడ్ పై పడిపోతారు. ఇద్దరు రొమాంటిక్ గా చూసుకుంటు ఉంటారు. అప్పుడే నందగోపాల్ వచ్చినట్లు వాళ్లకు వినిపిస్తుంది. వాడు వచ్చాడని రాజ్ అంటాడు. ఆ తర్వాత నందగోపాల్ తన గర్ల్ ఫ్రెండ్ తో లోపలికి వస్తారు. వాళ్ళకి ఎదరుగా రాజ్ , కావ్య ఉంటారు. ఎన్ని రోజులు తప్పించుకుంటావురా.. ఇంత మోసం చేస్తావా అని రాజ్ అనగానే.. లాస్ వచ్చింది అందుకే ఇలా చేసానని నందగోపాల్ అంటాడు. నందగోపాల్ ని రాజ్ కొడుతుంటే అతను పారిపోతాడు. తన వెనకాలే రాజ్, కావ్య వెళ్తారు కానీ మధ్యలో కార్ ఆగిపోతుంది.
ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్ కి వెళ్తాడు. మీ సర్ ఎక్కడ చెప్పమని సెక్యూరిటిని రాజ్ అడుగుతాడు. నాకు తెలియదని అతను చెప్తాడు. ఎలాగైనా వాడిని వెతికి పట్టుకోవాలని కావ్య అంటుంది. తరువాయి భాగంలో మీరు ఊరేగడానికి ఏసీ కార్ కావాలి.. ఇంట్లో వాళ్ళు బయటకి వెళ్ళడానికి ఒక్క కార్ కూడా అవసరం లేదా మీకు కార్లు వద్దని చెప్పే అధికారం ఎవరు ఇచ్చారని కావ్యని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అన్ని విషయాల్లో సర్వహక్కులు తాతయ్య గారు నాకు ఇచ్చారు.. మీకు నచ్చినా, నచ్చకున్నా నేను చెప్పింది వినాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read