Brahmamudi : డబ్బుల కోసం కార్లని పంపించేయాలనుకున్న కావ్య.. దుగ్గిరాల ఫ్యామిలీ కనిపెడతారా?
on Dec 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -606 లో.... కావ్య, రాజ్ లు ఎందుకో టెన్షన్ పడుతున్నారని, అదేంటో తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది. ఇంత డబ్బు ఉండి అయిదు లక్షల హాస్పిటల్ బిల్ కట్టలేదని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. ఆస్తులు, డబ్బు అన్నీ కూడా వాళ్ళ పేరున చేసుకొని ఉంటారు లేక డబ్బు లేకపోవచ్చని రుద్రాణి అన్ని యాంగిల్స్ లో ధాన్యలక్ష్మికి చెప్తుంది. ఇంత ఆస్తులున్నాయి.. డబ్బు ఎందుకు ఉండదని ధాన్యలక్ష్మి అనగానే ఒక్కోసారి ఎన్ని ఆస్తులున్నా ఇలా జరుగుతుందని రుద్రాణి అంటుంది.
మరొకవైపు రాజ్ తన ఫ్రెండ్స్ ని అయిదు లక్షలు అప్పు అడుగుతాడు. వాళ్ళు లేవని అనడంతో రాజ్ ఫీల్ అవుతాడు. అప్పుడే కావ్య తన నగలు తీసుకొని వచ్చి.. ఇవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని రండి అనగానే ఇంట్లో ప్రాబ్లమ్ అవుతుందని రాజ్ అంటాడు. ఏం ప్రాబ్లమ్ అయిన నేను చూసుకుంటానని కావ్య అంటుంది. రాజ్ తన వంక ప్రేమగా చూసేసరికి.. ఏంటి నన్ను హగ్ చేసుకోవలనిపిస్తుందా అని కావ్య అనగానే.. నా మనసులో మాట ఎలా కనిపెట్టిందని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి బిల్ కట్టలేదు అంటాడు. అదంతా అప్పు వింటుంది. కళ్యాణ్ ఫోన్ కట్ చేస్తాడు. బిల్ కట్టాడని కళ్యాణ్ అంటాడు. అప్పుడే నర్సు వచ్చి బిల్ పే చేశారని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ అప్పుతో కళ్యాణ్ మాట్లాడతాడు. ఏం జరిగింది చెప్పకుంటే నా పైన ఒట్టేనని అనగానే.. సీతారామయ్య గురించి చెప్తాడు కళ్యాణ్. నేను వస్తానని అప్పు అనగానే.. నువ్వు దేని కోసం వెళ్ళావో అది సాధించుకొని రా అని కళ్యాణ్ అంటాడు.
ఆ తర్వాత రాజ్ కి కార్ కాంట్రాక్టు బిల్ వస్తుంది. అది చూసి టెన్షన్ పడతాడు. కావ్య వస్తుంది ఏమైందని అనగానే బిల్ మూడు లక్షలు వచ్చిందని. ఇప్పుడేం చెయ్యాలని అంటాడు. కార్లని పంపించిస్తే ఇక బిల్ కట్టే అవసరం ఉండదు కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read