Brahmamudi: రుద్రాణి కోసం కుర్చీ ప్లాన్ వేసిన కనకం.. స్వప్న మనసులో విషబీజం!
on Jan 14, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-618లో.. అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది. నువ్వు అన్నింటిని భరిస్తావని నాకు తెలుసు.. కానీ అసలెందుకు చేస్తున్నావ్ ఇదంతా.. ఏం సాధిద్దామని.. నువ్వు తప్పు చేయకుండా ఎవరైనా ఏదైనా అంటే సహించవు. ముఖం మీదే సమాధానం చెప్పేస్తావ్.. అలాంటి నువ్వు ఎందుకు మారిపోయావ్? దీనికి కూడా కారణాలు ఉన్నాయా అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య అల్లాడుతుంటుంది. కంగారుపడొద్దు.. నీ అంతట నువ్వు చెప్పే వరకూ నేనేం అడుగను.. నేను వచ్చింది కేవలం రేపు సీమంతం లిస్ట్ నీతో రాయిద్దామని.. ఇంతలో స్వప్న వచ్చిందని అక్కడే ఆగాను.. నీ పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చేసెయ్ అని కావ్యతో అపర్ణ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కనకం ఒక వ్యక్తిని కూర్చోబెట్టుని.. రేయ్ సీమంతం శ్రీను.. సీమంతానికి కావాల్సినవి లిస్ట్ చెబుతాను రాసుకోమంటూ అన్నీ రాయిస్తుంది. మొత్తం నలభై వేలు ఖర్చు అయ్యింది కనకం అయ్యాయ్ అని శ్రీను అంటాడు. రేయ్ అంత ఎందుకు అవుతుందిరా అంటూ లెక్కలు మార్చడానికి.. ప్లాస్టిక్ పళ్లు, ప్లాస్టిక్ పువ్వులూ లాంటివి ఎవరికి తెలియకుండా సెట్ చెయ్యాలి అని కింద వాటిని పెట్టి.. పైన అసలు పళ్లు, పూలు పెట్టాలని శ్రీనుతో కలిసి ప్లాన్ చేస్తుంది కనకం.
ఇక స్వప్న దగ్గరికి రాహుల్, రుద్రాణిలు వస్తారు. తనవైపుకి తిప్పుకోవాలని ఇద్దరు ట్రై చేస్తారు. అయ్యో స్వప్న.. ఇప్పటి దాకా ఏదో జరిగింది. ఖర్చు మిగల్చాలని.. నిన్ను సీమంతానికి పుట్టింటికి తీసుకెళ్తుంది సరే.. రేపు పుట్టబోయేవాడు పెద్దగా ఖర్చు ఉండకూడదని.. నిన్ను డెలివరీకి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్తుందేమో.. నువ్వే బాగా ఆలోచించుకోమని స్వప్న మనసులో అనుమానాన్ని నింపేసి.. సైగలు చేసుకుని బయటికి వెళ్లిపోతారు రుద్రాణి, రాహుల్. ఇక బయటికి వచ్చాక రుద్రాణీ కొడుకుతో.. ఇక్కడ నిప్పు రాజేశాం.. రేపు అక్కడంతా తగలెట్టేద్దాం పదా అని అంటుంది. మరునాడు కనకం, సీమంతం శ్రీను కలసి.. స్వప్న సీమంతం ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక సీమంతం శ్రీను.. ఇంటి ముందు కూర్చీలు వేయిస్తుంటే.. ఒక కుర్చీకి ఒక కాలు ఉండదు. ఏంట్రా ఇలాంటి కుర్చీ వేయించావంటుంది కనకం. అంటే అక్కా మొన్న జరిగిన సీమంతంలో ప్లాస్టిక్ అరటిపండ్లు పెట్టారని.. కుర్చీలతోనే కొట్టుకున్నారు. అప్పుడు ఇరిగిపోయింది. దీన్ని తీయించేస్తానులే అక్కా.. దీనిలో కూర్చుంటే నడుము విరిగిపోతుందంటూ తీయించేయబోతాడు. వెంటనే నాకు అలాంటి శత్రువులు ఎవరున్నారని రుద్రాణీని తలుచుకుని.. లేదు లేదు.. ఈ కుర్చీని ఇక్కడే ఉంచు.. అంటుంది కనకం. బాలేదు కదా అక్కా కూర్చీ అని శ్రీను అనగానే.. ఒక్క నిమిషం అని శాలువా తెచ్చి కుర్చీకి కాలు లేదన్న విషయం తెలియకుండా కప్పేస్తుంది కనకం. ఇంతలో కృష్ణమూర్తి వచ్చి.. ఏంటి కనకం.. ప్లాస్టిక్ పళ్లు కూడా పెట్టావ్.. పరువు పోగొట్టే పని ఏదైనా జరిగితే ఊరుకోను చెబుతున్నానంటూ అదే కూర్చీలో కూర్చోబోతాడు. దాంతో శ్రీను, కనకం ఇద్దరూ కెవ్వమని.. కూర్చోకుండా చేసి.. అతడ్ని పంపేస్తారు. ఇక రుద్రాణీ కోసం అయితే ఆ విరిగిన కుర్చీ సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read