Brahmamudi : ఇందిరాదేవి రిక్వెస్ట్.. రంగంలోకి దిగిన కవి!
on Jan 28, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -630 లో.... కావ్యని చంపాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఆది ఫెయిల్ అయి రివర్స్ గా రుద్రాణికి షాక్ వస్తుంది. దాంతో స్వప్న కాపాడుతుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. స్వప్న అక్కడ నుండి వెళ్ళిపోయాక అది కావ్య కోసం రాహుల్ వేసిన ప్లాన్ అని రుద్రాణికి తెలిసి రాహుల్ ని తిడుతుంది. మరోవైపు అప్పు ట్రైనింగ్ కి వెళ్తుంటే కళ్యాణ్ బ్యాగ్ సర్దుతాడు. అప్పుడే అపర్ణ కాల్ చేస్తుంది. కళ్యాణ్ పక్కకి వచ్చి మాట్లాడతాడు. మీ వదిన నీతో గెస్ట్ హౌస్ తాకట్టు గురించి ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది.
నాతో ఏం చెప్పలేదు పెద్దమ్మ.. అయిన ఏమైంది అంటూ ఆశ్చర్యంగా కళ్యాణ్ అడుగుతాడు. ఏం లేదు కానీ నువ్వు ఈ విషయం కావ్యతో అనకు అని చెప్పి అపర్ణ ఫోన్ కట్ చేస్తుంది. కళ్యాణ్ మాత్రం షాక్ లోనే ఉంటాడు. అప్పు వస్తుంది. ఏమైందని అడుగగా.. ఏం లేదు ట్రైన్ కి టైమ్ అవుతుంది పదా అంటూ అప్పుని తీసుకొని కళ్యాణ్ వెళ్తాడు. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కోర్ట్ నుండి నోటీస్ వస్తుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. కోర్ట్ నుండీ నోటిసులని చెప్పగానే ఎవరు పంపారని సుభాష్ అడుగుతాడు. మేమే పంపించామని ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు అంటారు. ఆస్తులలో మా వాటా కావాలని ఇలా చేసామని ధాన్యలక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు. ఏంటి రా ఇది అని ప్రకాష్ ని సుభాష్ అడుగుతాడు. నీ భార్యకి బుద్ది లేదు నీకేమైందని అపర్ణ కోప్పడుతుందిమ నా భర్త అలా ఉంటే మీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా అంటూ వాళ్లపై ఇందిరాదేవి విరుచుకుపడుతుంది.
నేను ఒక పరిస్థితికి కట్టుబడి ఉన్నాను అంతే తప్ప ఈ ఆస్తులన్నీ నా పుట్టింటికి తీసుకొని వెళ్ళను కదా అని కావ్య నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినా వాళ్ళు వినరు. సుభాష్, అపర్ణల దగ్గరికి కావ్య వచ్చి.. మీరు ప్రకాష్ మావయ్య కి చెప్పండి అని కావ్య సుభాష్ ని రిక్వెస్ట్ చేస్తుంది. చేసిందంతా చేసి ఇప్పడు ఇలా అంటున్నావా అని కావ్యతో అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో లాయర్ ఇంటికి వస్తాడు. తాత ఆస్తులకి మనవళ్ళు వారసులు కదా.. వీళ్ళు చెప్తే నోటీసులు ఎలా పంపారని లాయర్ ని కావ్య అడుగుతుంది. మా కొడుకు చేతనే నోటీసులు పంపిస్తామని ధాన్యలక్ష్మి అనగానే.. ఆపండి అంటూ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)