Biggboss 8 Telugu: బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్.. కారణాలివే!
on Dec 16, 2024
బిగ్ బాస్ సీజన్-8 ముగిసింది. మూడు నెలల పాటు తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన ఈ షో నిన్నటి ఎపిసోడ్ తో పూర్తయింది. ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ తో గ్రాంఢ్ గా కొనసాగిన ఈ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చేముందు ఒకలా.. వాళ్ళు వచ్చాక మరోలా ఉంది.
బిగ్ బాస్ గత ఎనిమిది సీజన్ల నుండి ఒకటే ప్యాట్రన్ ఫాలో అవుతున్నారు. సేమ్ గెస్ట్ లు రావడం.. హరీబరీగా ఫినిష్ చేయడం.. కప్ ఇచ్చేయడం.. హోస్ట్ జర్నీ వీడియో చూపించడం కామన్ గా మారింది. ఇదే రెగ్యులర్ గా చూడటం డిస్సపాయింట్ గా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ఎంతలా అంటే చాలా మంది అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. దీనికి ప్రధాన కారణం విన్ అయ్యాక ఎమోషన్స్ సరిగ్గా లేవని, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయిన వాటిని కూడా వన్ మినిట్ కూడా చూపించలేదు. ఎందుకంటే అక్కడ టైమ్ లేదు. చాలా మంది సెలెబ్రిటీలు రావడం.. వారి గురించి మాట్లాడం.. సినిమా ప్రమోషన్స్. ఇలా అన్నీ ప్రమోషనల్ కోసం గ్రాంఢ్ ఫినాలే ఏర్పాటు చేశారా అన్నట్టుగా ఉంది.
ఇక నిఖిల్ విన్నర్ అయ్యాక సాధారణంగా అనిపించింది. అదే గౌతమ్ విన్నర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో. ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా లేదని తరలిపోయింది. గత ఎనిమిది సీజన్ల నుండి రెగ్యులర్ గా సాగడం మరింత బోరింగ్ గా అనిపించింది. ముఖ్యంగా నిఖిల్ కి సరైన విన్నింగ్ స్పీచ్ రాలేదని, గౌతమ్ కి సరిగ్గా రెండు నిమిషాలు కూడా మాట్లాడటానికి టైమ్ ఇవ్వకపోవడంతో తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది సెలెబ్రిటీలు స్టేజ్ మీదకి వచ్చినా వారిది ఫైనల్ ఎపిసోడ్ లో తీసేసినట్టుగా తెలయస్తోంది. ఈ సీజన్-8 లో పెద్ద మైనస్ ఏంటంటే.. కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు ఫ్యాన్స్ ఓటింగ్ లో పోటీపడటం.. దీనివల్ల జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగింది. హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్ చేసిన అవినాష్.. ప్రతీ గేమ్ లో గెలిచాడు కానీ గౌతమ్ ఇండివిడ్యువల్ గా ఆడుతున్నానంటు ఎక్కువ గొడవలు పెట్టుకోవడం, అతడికి స్క్రీన్ స్పేస్ ఎక్కువవడంతో అవినాష్ కి ఓటింగ్ లేకుండా పోయింది. గ్రాంఢ్ ఫినాలే గ్రాంఢ్ గా లేకపోవడం.. ఒక స్పార్క్ లేకపోవడంతో ఈ సీజన్-8 అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచింది. మరి ఫైనల్ డే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Also Read