బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ !
on Jul 5, 2023
బిగ్ బాస్ టెలివిజన్ రంగంలో ఎంత పాపులారిటి సంపాదించుకుందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్-7 కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టెలివిజన్ రంగంలోనే అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతు విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకొని, ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఇందులో కంటెస్టెంట్స్ ఎంపిక అనేది కీలకమైన అంశం. ఎందుకంటే గత సీజన్లో కంటెస్టెంట్స్ ఎంపికపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్-7 భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్ సెట్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం.. బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా ఈ నెల ఆఖరున జరుగనునట్లు తెలుస్తుంది. ఇక హోస్ట్ విషయానికొస్తే మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ చేయగా, రెండవ సీజన్ నేచురల్ స్టార్ నాని చేశాడు. గత నాలుగు సీజన్ల నుండి నాగార్జున వ్యవహరించగా.. ఈ సీజన్ కి నాగార్జున నో చెప్పాడంటు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అందులో వాస్తవం లేదు. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడట. దానికి సంబంధించిన అగ్రిమెంట్ లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సారి ప్రేక్షకుల దృష్టి మొత్తం.. ఏ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా అని ఉంది. అందరిలోనూ ఇదే క్యూరియాసిటి ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ బిగ్ బాస్ టీం కొంతమందిని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. అన్ని సీజన్లలో కంటే ఈ సీజన్లో 25 మంది కంటెస్టెంట్ లను హౌస్లోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయంట. అందులో కొంతమంది యూట్యూబర్స్, కామన్ మ్యాన్, న్యూస్ ఛానల్ నుండి ఒకరు, జబర్దస్త్ షో నుండి, సింగర్, డాన్సర్ కేటగిరీలలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అయితే ఏ కేటగిరీలో ఎవరు బిగ్ బాస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
