ఒకడు తనని నమ్మించి మోసం చేశాడని ఆదిరెడ్డి ఆవేదన!
on Jan 8, 2024
.webp)
ఒకడు నన్ను దారుణంగా మోసం చేశాడు. ఎంతలా అంటే నేనెంత నమ్మానో నన్ను అంతలా మోసం చేశాడంటూ తనకి జరిగిన నిజ జీవిత అనుభవాలని పంచుకున్నాడు ఆదిరెడ్డి. అసలేం జరిగింది? ఎందుకింతలా జరిగిందని ఓ ఇంటర్వూలో ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి ముందు ప్రతీ ఎపిసోడ్ చూసి రివ్యూలు ఇచ్చిన అదిరెడ్డి.. కామన్ మ్యాన్ కేటగిరీలో సీజన్ సిక్స్ లో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాల మధ్య కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన ఆదిరెడ్డికి బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. హౌస్ లో జెన్యున్ ప్లేయర్ అంటే ఆదిరెడ్డి అనేంతలా తన ఆటతీరుని కనబరిచేవాడు. అలాగే గీతురెడ్డితో స్నేహం అతనికి కాస్త కలిసొచ్చింది. తన స్ట్రాటజీలు ఇతర కంటెస్టెంట్స్ మీద చూపించే గీతు రాయల్.. ఆదిరెడ్డి మీద చూపించేది కాదు. అదొక ప్లస్ అవ్వగా.. ప్రతీ నామినేషన్ లో వ్యాలిడ్ రీజన్ లు చేప్తూ ఆడియన్స్ ఇలా అనుకుంటారు. ఇది కరెక్ట్.. మనం ఇలానే ఉండాలని అనుకుంటు మరింత ఫెయిర్ ప్లే గేమ్ ఆడాడు. ఇక సీజన్ సిక్స్ లో టాప్- 4 కంటెస్టెంట్స్ లలో ఒకడిగా ఉండి ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆదిరెడ్డి.
ఆదిరెడ్డి ఎలిమినేషన్ తర్వాత అతనికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఓ విన్నర్ కి ఉన్నంత క్రేజ్ ఆదిరెడ్డికి వచ్చిందంటే అందులో ఆశ్చర్యం లేదు. ఇక బయటకొచ్చాక ఆదిరెడ్డి తనదైన శైలిలో బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూ అందరికి దగ్గరయ్యాడు. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ లో కొన్ని వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇక సీజన్ సెవెన్ విన్నర్ ప్రశాంత్ కావాలని కోరుకున్న వారిలో ఆదిరెడ్డి ఒకడని అతనే చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ గెలిచిన తర్వాత ఇంటర్వూ ఇవ్వలేదని కొంతమంది యూట్యూబర్స్ ఫాల్స్ ప్రచారం చేస్తే.. ఎందుకు బ్రో అంటూ వాళ్ళని నిలదీశాడు. ఇక ఆ ఇష్యూ అంత అయిందనే టైమ్ లో మరో ప్రాబ్లమ్ తనకొచ్చిందని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు. తను సొంతంగా ఇల్లు కట్టుకునే దగ్గరికి ఒకడు స్కూటీ మీద వచ్చి టీలు ఇచ్చేవాడంట. ఒకరోజు ఆదిరెడ్డిని చూసి ఎంది బ్రో స్కూటీ మీద వచ్చి టీ ఇవ్వడమేంటి? నీకు ఎంతొస్తుందని అడిగితే.. రోజుకు రెండు వేల వరకు ఆదాయం వస్తుందని ఆ టీ అమ్మేవాడు చెప్పేసరికి వాడి డెడికేషన్ కి నేను ఫిధా అయ్యి.. నా భుమిలో కొంత స్థలం ఇస్తా.. రేకులు వేసుకొని టీ షాప్ పెట్టుకో అని చెప్పాను. సరేనన్నాడు. ఓ రోజు యాభై వేలు కావలన్నాడు. సరే కష్టపడి పనిచేస్తున్నాడు కదా అని ఇచ్చాను. ఆ తర్వాత రోజు నుండి వాడు నాకు కనపడనేలేదు. ఇది చూసి నా మైండ్ బ్లాక్ అయింది. ఒకడు నిన్ను మోసం చేస్తున్ననాడంటే వాడికి నువ్వు ఓ అవకాశం ఇచ్చినట్టే, అసలు ఎవరిని నమ్మకూడదని, ఇది ప్రతీ ఒక్కరికి ఓ గుణపాఠం కావాలని చెప్తున్నానని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



