పెళ్లి లేదు గిల్లి లేదు.. పవన్ కళ్యాణ్ తో అవకాశం వస్తే నటిస్తా!
on Mar 15, 2025
బుల్లితెర మీద నిఖిల్, కావ్య గురించి తెలియని వారు లేరు. అలాంటి వాళ్ళు ప్రెజెంట్ విడిపోయారు. బిగ్ బాస్ కి వెళ్లేముందే వీళ్ళు ఒకరికి ఒకరు కాదు, మేము వేరు వేరు అంటూ చెప్పేసారు. అలాగే ఎవరి సోషల్ మీడియాస్ పేజెస్ లో వాళ్ళు ఇంకొకరిని అన్ ఫ్రెండ్ కూడా చేసేసుకున్నారు. ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు.
ఇక ఇప్పుడు కావ్య కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. "నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. నేను ఈ స్టేజికి వచ్చాక హ్యాపీగా ఫీలయ్యింది మా అమ్మ. మా అమ్మకు నన్ను ఎప్పుడూ ఆన్ స్క్రీన్ లో చూడాలని ఆశపడేది. అప్పుడప్పుడు వంట చేస్తాను..కానీ ఎవరూ తినరు. పర్టిక్యూలర్ గా ఇది అని కాదు వెజిటేరియన్ లో ఏదైనా ఓకే నాకు. ఎవరైనా పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు షూటింగ్ టైమ్స్ లో జోక్స్ చేసుకోవడం ఆడుకోవడం ఇష్టం. ఏ పర్సన్ ఐనా నన్ను కేరింగ్ గా చూసుకుంటే చాలు..కోపం పీక్స్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్లి తిట్టేయడమో, ఏడ్చేయడమో చేసేస్తాను. నవ్వుతూ కవర్ చేయడం మాత్రం నాకు రాదు. ఏ హీరోతో ఆఫర్ వచ్చినా మూవీ చేస్తాను కానీ నా ఫెవరేట్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.. ఆయన ఛాన్స్ వస్తే చేస్తాను. పరిస్థితిని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఏదైనా ప్లేస్ కి వెళ్ళేటప్పుడు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటా, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు హోమ్లీ డ్రెస్ లో వెళ్తాను. సీరియల్స్ ని ముందుగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే సీరియల్స్ చేయడం వల్లనే ఈవెంట్స్ కి ఛాన్సెస్ వస్తాయ్.. ముందుగా బేస్ సీరియల్స్ కాబట్టి సీరియల్స్ ఇష్టం. నాకు పచ్చగా ఉండే ప్రాంతాలంటే చాలా ఇష్టం.. కూర్గ్ లాంటి ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. అలాగే అవుటాఫ్ కంట్రీ అంటే స్విట్జర్లాండ్ అలా ఇష్టం. లవ్ మ్యారేజ్ లేదు అరేంజ్డ్ మ్యారేజ్ కూడా లేదు. నో మ్యారేజ్ అంతే. ఇర్రిటేషన్ అనే పర్సన్ కొన్ని రోజుల క్రితం వరకు ఉండేవాళ్లు కానీ ఇప్పుడు మైండ్ లో అలాంటిది ఏమీ లేదు. మా ఫామిలీని తలుచుకుంటే నా ఫేస్ లో స్మైల్ వస్తుంది. నాకు నా ఫామిలీ అంటే ఇష్టం. నా జీవితంలో నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఏంటంటే ఎవరినీ మోసం చేయకూడదు, ఎవరినీ బాధపెట్టకూడదు అనేది నేర్చుకున్నా" అంటూ కావ్య చాలా విషయాలు చెప్పేసింది. ఐతే నెటిజన్స్ మాత్రం కావ్య నిఖిల్ మళ్ళీ కలవాలి అంటూ కింద కామెంట్స్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
