Bigg Boss 9 Last Captain: ఇద్దరు పవన్ ల మధ్య టఫ్ ఫైట్.. బిగ్ బాస్-9 చివరి కెప్టెన్ ఎవరంటే..?
on Nov 29, 2025

బిగ్ బాస్ సీజన్-9 ఈ వారం మొదటి రోజు నుండి చివరి కెప్టెన్ ఎవరు అవుతారోనని అందరిలో ఎక్సైట్ మెంట్ ఉంది. చివరగా కెప్టెన్సీ రేస్ లో డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ ఉంటారు. బిగ్ బాస్ వాళ్ళకి చివరి కెప్టెన్ అవ్వడానికి ఒక టాస్క్ ఇస్తాడు. గుంతలుగా ఉన్న రోడ్డుని ఇచ్చిన వస్తువులతో సరి చెయ్యాలి. ఎవరు ముందు వేస్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్ అయి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్తాడు. సంచాలకులుగా ఎవరిని సెలక్ట్ చేసుకుంటారని బిగ్ బాస్ డీమాన్, కళ్యాణ్ ని అడుగుతాడు. నన్ను సెలెక్ట్ చేసుకోండి అని దివ్య అంటున్నా పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ తనూజని సెలెక్ట్ చేసుకున్నారు.
టాస్క్ మొదలవుతుంది. ఇద్దరు బాగా ఆడుతారు. టాస్క్ ఎండింగ్ టైమ్ లో డీమాన్ కి నడుంనొప్పి రావడంతో గేమ్ లో ముందుకు పోలేకపోతాడు. అయినా లాస్ట్ వరకు ఆడతాడు.. కానీ కళ్యాణ్ ఈ టాస్క్ లో విన్ అవుతాడు. డీమాన్ ఆడలేకపోయినందుకు ఎమోషనల్ అవుతాడు. డీమాన్ గెలవలేదని కళ్యాణ్ ఏడుస్తాడు. కళ్యాణ్, డీమాన్ ఇద్దరు ఎమోషనల్ అవుతారు.
Also Read: డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. ఈ వారం దివ్య, సంజన అవుట్!
డీమాన్ ని డాక్టర్ రూమ్ కి రమ్మని బిగ్ బాస్ పిలుస్తాడు. ఆ తర్వాత నేను చాలా ట్రై చేసాను కానీ కాలేదని రీతూతో చెప్తూ డీమాన్ ఎమోషనల్ అవుతాడు. బిగ్ బాస్ ఆదేశానుసరం రీతూ తన కెప్టెన్సీ బ్యాండ్ ని కళ్యాణ్ కి పెడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ తన స్టైల్ లో సెల్యూట్ చేస్తాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



