Bigg boss 9 Telugu : బిగ్ బాస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే!
on Sep 13, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 మొదలై అయిదు రోజులవుతుంది. అప్పుడే వీకెండ్ కూడా వచ్చేసింది. వీకెండ్ అంటే తెలుసుగా మాములుగా ఉండదు. కంటెస్టెంట్స్ కి ఈరోజు నాగార్జున వచ్చి ఏమంటాడోనని చెమటలు పడతాయి. ఎప్పటిలాగే వీకెండ్ లో కొంతమందిని సేవ్ చేసి మిగతా కంటెస్టెంట్స్ ని ఆదివారం రోజు ఎలిమినేట్ చేస్తారు. ఎవరైతే ఆడియన్స్ వేసిన ఓటింగ్ లో లీస్ట్ లో ఉంటారో వాళ్ళే హౌస్ నుండి బయటకు వస్తారు.
ప్రస్తుతం ఓటింగ్ లో మొదటి స్థానంలో తనూజ ఉండగా ఎవరు ఊహించని విధంగా సుమన్ శెట్టి రెండవ స్థానంలో ఉన్నాడు. సుమన్ శెట్టికి ఇప్పటివరకు బిగ్ బాస్ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. అందుకే అతడిని కావాలని చూపించట్లేదు. అయితే సుమన్ శెట్టికి సంబంధించిన కొన్ని వీడియోలు మాత్రం ఇన్ స్టాగ్రామ్ లోకి వస్తున్నాయి. హౌస్ లో అందరితో సుమన్ శెట్టి కలిసి ఉంటున్నాడని బిగ్ బాస్ అవేమీ చూపించట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకే అతను ఓటింగ్ లో టాప్-2లో ఉన్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాలలో అయితే డీమాన్ పవన్, రీతూ చౌదరి, ఫ్లోరా సైని ఉన్నారు. డీమాన్ పవన్ బయటకు వెళ్లే ఛాన్స్ అయితే తక్కువ ఎందుకంటే అతను కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులోను కామనర్స్ ఆరుగురే కాబట్టి తను ఇప్పుడే అప్పుడే బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక రీతూ చౌదరి విషయానికి వస్తే ఇప్పడున్న కంటెస్టెంట్స్ లో ఎక్కువ జనాలకి ముఖపరిచయం ఉంది తనే.
రీతూ చౌదరి అంత ఈజీగా హౌస్ నుండి బయటకు రాదు. ఇక ఫ్లోరా సైనీకి తెలుగులో ఎక్కువ ఫ్యాన్ బేస్ లేకపోవడం.. తెలుగు మాట్లాడటం సరిగ్గా రాకపోవడం.. హౌస్ లో సైలెంట్ గా ఉండడం.. ఇవన్నీ తనకి మైనస్ అవుతున్నాయనే చెప్పాలి. ఈ వారం హౌస్ నుండి ఫ్లోరా సైనీ బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కన్పిస్తుంది. అయితే ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వస్తారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



