Bigg Boss 9 Telugu Demon Pawan: రెండు స్టార్లు గెలుచుకున్న డీమాన్ పవన్.. టాస్క్ ల్లో అతడిని కొట్టేవారు లేరుగా!
on Dec 16, 2025

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ని సక్రమంగా నడిపించాలంటే ఖచ్చితంగా కెప్టెన్ అవసరం కెప్టెన్ అయితే ఆ వారం ఇమ్మ్యూనిటీ కూడా ఉంటుంది. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఈ సీజన్ లో గత వారమే ముగియడంతో దానికి సంబంధించిన బ్యాండ్ ని బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పాడు. కంటెస్టెంట్స్ అందరు బ్యాండ్ ధరించి ఒక్క మాట కెప్టెన్ గురించి చెప్తారు. ఆ తర్వాత స్టోర్ రూమ్ లో పెడుతారు. కాసేపటికి బిగ్ బాస్ హౌస్ లో టాప్-5 వాళ్లకి ఇష్టమైన ఫుడ్ పొందేందుకు బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ఒక టాస్క్ లో తనూజ, కళ్యాణ్ ఒక టీమ్...ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ ఒక టీమ్ కాగా సంచాలక్ గా సంజన ఉంటుంది అందులో ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ గెలుస్తారు. ఇద్దరికి చెరొక స్టార్ వస్తుంది. అంతేకాకుండా వారికి ఇష్టమైన బర్గర్ కూడా వస్తుంది. అది వాళ్ళు ఇద్దరు మాత్రమే తినాలని బిగ్ బాస్ చెప్తాడు.
ఆ తర్వాత టాస్క్ లో అయిదుగురు పాల్గొన్నాలి.. సాంగ్ వస్తున్నంత సేపు డ్యాన్స్ చెయ్యాలి.. సాంగ్ ఆగగానే నేను చెప్పిన కలర్ లో నుండి ఎవరు లాస్ట్ కి వస్తారో వాళ్ళు ఆ రౌండ్ నుండి ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పగా. మొదటగా సంజన ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ వస్తారు. ఇక లాస్ట్ వరకు ఉండి విన్ అయింది డీమాన్ పవన్. అతనికి మరొక స్టార్ వచ్చి మళ్ళీ తనకి ఇష్టమైన ఫుడ్ వస్తుంది.
ఈ సారి మనం ఇద్దరం కలిసి ఆడి వాడికి స్టార్ రాకుండా చెయ్యాలని కళ్యాణ్ తో ఇమ్మాన్యుయేల్ అనగానే.. పోనిలే అన్న పదమూడు వారాలు గెల్వలేదు కదా ఇప్పుడు గెలవనివ్వు అని కళ్యాణ్ అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. ఇలా ఎక్కువ టాస్క్ లు గెలిచి ఎక్కువ స్టార్ వస్తే వాళ్ళు ప్లేయర్ అఫ్ ది వీక్ అవుతారు. దాంతో వాళ్ళకి ఫ్యామిలీ నుండి ఏదైనా మెసేజ్ వస్తుంది. ప్లేయర్ అఫ్ ది వీక్ ఎవరు అవుతారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



