అయిదో వారం నామినేషన్లో ఉందెవరంటే!
on Oct 1, 2024
బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. గతవారం సోనియా ఎలిమినేషన్ అవ్వగానే అటు హౌస్ మేట్స్, ఇటు ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక అయిదో వారం నామినేషన్లు జరిగాయి.
ఇంట్లో ఎవరి ప్రయాణాన్ని బూడిద చేయాలనుకుంటున్నారో, ఎవరిలో గెలవాలనే ఫైర్ లేదో వారి ఫోటోని ఫైర్‌లో వేసి నామినేట్ చేయండి అని బిగ్ బాస్ కోరాడు. అలాగే చీఫ్ అయిన కారణంగా సీత, నిఖిల్‌లను ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియను మణికంఠ మొదలుపెట్టాడు. నైనికను నామినేట్ చేశాడు మణికంఠ. నీకు డెసిషన్ పవర్ తగ్గుతూ వస్తుంది.. కంఫర్ట్ రూమ్ నుంచి బయటికి రావట్లేదు.. నిన్ను బెడ్డు మీద తప్ప ఇంకెక్కడా నేను చూడట్లేదు.. నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం లేదు.. ఏదైనా సిచువేషన్ వచ్చినప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పాలి.. ఇక్కడున్న పది మందిలో నువ్వు డల్‌గా ఉన్నావంటూ మణికంఠ రీజన్స్ చెప్పాడు. దీనికి నేను అవసరం ఉన్న చోటే మాట్లాడతా.. అందరితో ఉండే నీ పర్ఫామెన్స్ ఏముంది అంటూ నైనిక కొశ్చనన్ చేసింది. ఇక తన రెండో నామినేషన్ యష్మీకి వేశాడు మణికంఠ. యష్మీ నాతో పాటు గుడ్ల టాస్కులో ఉన్నావ్.. నేను ఫిజికల్‌గా ఎంత కష్టపడినా నేను ఆడలేదని చెప్పావ్.. అది నాకు నచ్చలేదు. అలానే మాటలు వదిలేస్తున్నావ్.. నాగ్ సర్ ఆ ఫుటేజి చూపించకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు.. నువ్వు అప్పుడే రియలైజ్ అయి సారీ చెప్పి ఉంటే బాగుండేది.. అంతా అయ్యాక నాగ్ సర్ చెప్పాకే సారీ చెప్పావంటూ మణికంఠ తన పాయింట్స్ చెప్పాడు.
నబీల్‌ను నైనిక నామినేట్ చేసింది. ఫుడ్ చాలా ఇంపార్టెంట్ .. నువ్వు సంచాలక్‌గా ఉన్నప్పుడు తప్పు డెసిషన్ వల్ల మాకు రేషన్ పోయిందంటు నైనిక చెప్పింది. దీనికి సారీ చెప్పిన నబీల్.. అవసరమైతే నేను లాస్ట్ తింటా.. కడుపు నిండా మీరు తినండి.. అంటు పొలైట్ గా చెప్పాడు. ఇక తర్వాత విష్ణుప్రియను నామినేట్ చేసింది నైనిక. నా గురించి నువ్వు వేరే వాళ్ల దగ్గర చెప్పిన కొన్ని నేను విన్నాను.. అవి నాకు నచ్చలేదు.. అంటూ నైనిక అంది. నువ్వు చెప్పింది ఎక్కడికైనా వెళ్లి చెప్పి ఉంటే దానికి సారీ అంటూ విష్ణుప్రియ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఆ తర్వాత నాగ మణికంఠ, విష్ణుప్రియని కిర్రాక్ సీత నామినేట్ చేసింది. విష్ణుప్రియ, నైనికలని నబీల్ నామినేట్ చేశాడు.
నైనిక, విష్ణుప్రియని ఆదిత్య ఓం నామినేట్ చేశాడు.నైనిక, నబీల్ ని విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఆదిత్య ఓం, నాగ మణికంఠని యష్మీ నామినేట్ చేసింది. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆదిత్య ఓం, నాగ మణికంఠ, నైనిక, నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ నామినేషన్ లో ఉన్నారు.
Also Read