మెచూర్డ్ గా థింక్ చేసే మణికంఠ జీరోనా.. రాంగ్ డెసిషన్స్ తీసుకునే నిఖిల్ హీరోనా!
on Oct 2, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు. ఎందుకంటే ఒక్కో గేమ్ కి ఒక్కోలా మారిపోతున్నారు. హౌస్ లో ప్రతీ గేమ్ కి బెస్ట్ సంచాలక్ గా నాగ మణికంఠ చేస్తున్నాడు. కానీ అతడిని హౌస్ అంతా ఆటలో అరటిపండులా పక్కన పెడుతున్నారు. మరోవైపు రాంగ్ డెసిషన్స్ తీసుకునే నిఖిల్ ని అనవసరంగా హీరోని చేస్తున్నారు. (Naga Manikanta)
వీకెండ్ లో నాగార్జున ఓ కుక్కని చూపించి ఇది కుక్క కాదు.. నక్క అని అంటే హౌస్ లో ఉన్నవాళ్ళంతా అది నక్క అనే నమ్ముతారు. ఎందుకంటే నాగార్జున అలా బిగ్ స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు. ఇక హౌస్ లో గతవారం గుడ్ల టాస్క్ జరిగింది. అందులో ఏం జరిగిందో చూపించాడు నాగార్జున. ఆ తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ లో మణికంఠని నిఖిల్ టీమ్ తీసేసారు. అలా వీక్ అని పక్కన పెట్టడమేంటని ప్రేరణ, కిర్రాక్ సీత అడిగారు. దాంతో అక్కడ సోనియా, నిఖిల్, పృథ్వీ బ్యాడ్ అయ్యారు. కానీ జరిగిందేంటని నాగార్జున బిగ్ స్క్రీన్ మీద చూపించడంతో.. మణికంఠే సాక్రిఫైజ్ చేశాడని హౌస్ మేట్స్ అంతా నమ్మేశారు. ఇక అదే రోజు హౌస్ లో ఎవరు అనర్హులో వారికి క్రాస్ మార్క్ వేయమని నాగార్జున అనగానే.. హౌస్ లో మెజారిటీ ఆఫ్ ది కంటెస్టెంట్స్ నాగ మణికంఠ రాంగ్ అని, అనర్హుడని చెప్తూ అతనికి క్రాస్ వేశారు. అతడికే ఎక్కువగా జీరోలు రావటంతో అతడిని జైల్లోకి పంపించేశాడు బిగ్ బాస్.
జైల్లోకి వెళ్ళిన నాగ మణికంఠ కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు. ఆడియన్స్ సేవ్ చేసిన తరువాత.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అభిప్రాయం ఎందుకు తీసుకుంటున్నారు? నన్ను ఆల్రెడీ జనం తమ ఓట్లతో సేవ్ చేశారు కదా.. మరి నన్నెందుకు జీరో అని చెప్పి ఈ జైలులో వేశారు. జనం సేవ్ చేశారంటే.. హౌస్‌లో ఉండటానికి అర్హత ఉందనే కదా అర్థం. జనం వాళ్ల అభిప్రాయాన్ని ఓట్ల ద్వారా చెప్పిన తరువాత.. హౌస్‌లో వాళ్లు ఇన్వాల్వ్ అవ్వడమేంటి? వాళ్లు నన్ను డేంజర్ జోన్‌లో పెట్టడమేంటి? ప్రతిసారి ఇలాగే అయితే దాని వల్ల నాకు నష్టం జరుగుతుంది కదా.. జనం పిచ్చోళ్లు కాదు కదా సేవ్ చేయడానికి. జనాల దృష్టిలో రాంగ్ అవుతుంది కదా బిగ్ బాస్ అని మణికంఠ మాట్లాడాడు.
Also Read