Home

»

Tv News

Bigg Boss 10 Telugu: వరెస్ట్ కంటెస్టెంట్ వర్షిణి.. నో కెప్టెన్సీ.. రామకృష్ణకు అన్యాయం!

Nov 15, 2026 11:30AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదో వారం శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. హౌస్‌లో  కంటెస్టెంట్స్ అంతా కలిసి వర్షిణి జీరో అని తేల్చేశారు. కానీ ఫ్యామిలీ కోసం వర్షిణికి కంటెస్టెంట్స్ సపోర్ట్ చేయగా రామకృష్ణకి అన్యాయం జరిగింది. 

ముందుగా నాగార్జున ఎవరు తమని హర్ట్ చేశారు. ఎవరికి సారీ చెప్పాలని అనిపించిందనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో వర్షిణి.. త్రిగుణ్ అన్న మాటలు తనని బాధించాయని, షేక్ చేశాయని చెప్పింది. దీనికి త్రిగుణ్ సారీ చెప్పాడు. శ్వేత.. రామ్ ప్రసాద్ కెప్టెన్సీ టాస్క్‌లో హ్యాండిచ్చాడని చెప్పింది. కానీ వీడియో చూపించగా శ్వేతదే తప్పు అని తేలింది. శివ.. ముకేష్ హర్ట్ చేశాడని, నరేష్.. త్రిగుణ్ హర్ట్ చేశాడని, అమన్.. త్రిగుణ్ హర్ట్ చేశాడని, సుధీర్.. ముకేష్ హర్ట్ చేశాడని చెప్పారు.

ఆ తర్వాత ఎవరు ఆటలో జీరో అనే టెస్ట్ పెట్టాడు నాగార్జున. ఇందులో వర్షిణి జీరో అని వంశీ, శ్వేత, నరేష్ చెప్పారు. సుధీర్ ఆటలో జీరో అని అమన్, ముకేష్, దేబ్జానీ చెప్పారు. త్రిగుణ్ జీరో అని రామకృష్ణ, శివ చెప్పారు. శివ జీరో అని వర్షిణి, త్రిగుణ్.. రామకృష్ణ జీరో అని సుధీర్ చెప్పారు. ఇందులో వర్షిణికి, సుధీర్‌కి సమానంగా ఓట్లు పడ్డాయి. ఇద్దరిలో దేబ్జానీ ఓట్ ద్వారా సుధీర్ సేఫ్ అయ్యాడు. వర్షిణికి పనిష్మెంట్ పడింది. దీని కారణంగా ఆమె ఈ సీజన్‌లో ఎప్పటికీ కెప్టెన్ కాలేదు. 

ఆ తర్వాత రామకృష్ణ, వర్షిణి ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. సో వారికి మరో ఛాన్స్ ఇచ్చారు. కానీ ట్విస్ట్ ఇస్తూ కంటెస్టెంట్ల ఓట్ల ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన వారి పేరెంట్ మాత్రమే లోపలికి వస్తారని చెప్పారు. దీంతో వర్షిణి తల్లికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రామకృష్ణ తల్లి గార్డెన్ ఏరియాలోనే ఉండిపోయింది. దీంతో రామకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com