.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో పదో వారం ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్‌తో నడుస్తోంది. ఈ క్రమంలో త్రిగుణ్ కోసం అతని భార్య, చిన్నారి కూతురు ఇంట్లోకి వచ్చారు. వారిని చూడగానే త్రిగుణ్ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. కూతురిని దగ్గరకు తీసుకుని గట్టిగా హగ్ చేసుకున్నాడు. భార్యను చూసి కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం ఇంట్లో ఉన్న వారందరూ ఎమోషనల్ అయ్యారు.
ఆ తర్వాత త్రిగుణ్ తన భార్యతో కాసేపు మనసు విప్పి మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు ఆట చాలా బాగా ఆడుతున్నావు.. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని భార్య ధైర్యం చెప్పింది. చాలా మంది నిన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తారు కానీ నువ్వు అసలు డైవర్ట్ కావద్దని చెప్పుకొచ్చింది. నీ గేమ్‌పై మాత్రమే ఫోకస్ పెట్టాలని చెప్పింది.
ఇదే సమయంలో త్రిగుణ్.. నేను కప్ గెలుస్తానా అని భార్యను అడిగాడు. దానికి ఆమె.. కప్ తీసుకురావాల్సిందే అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. నువ్వే విన్నర్ కావాలని గట్టిగా చెప్పింది. భార్య మాటలతో త్రిగుణ్‌కి ఫుల్ జోష్ వచ్చింది. ఈ ఎంట్రీతో త్రిగుణ్ గేమ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు త్రిగుణ్ పాప క్యూట్ గా ఉందని హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా తనతో అనుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన భార్యని, కూతురిని చూసుకున్న త్రిగుణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.




.webp)
.webp)
