భోలే షావలి ఎలిమినేటెడ్!
on Nov 12, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా థీమ్ తో అదరగొడుతుంది. కొత్త కంటెస్టెంట్స్ స్ట్రాటజీలతో ప్రేక్షకులను అందిస్తున్నారు. ఇక గతవారమంతా ఫ్యామిలీ వీక్ తో ఫుల్ ఎమోషనల్ చేశాడు బిగ్ బాస్. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ అభిప్రాయంతో శివాజీ కెప్టెన్ అయిన విషయం తెలిసిందే.
ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సంబరాలు జరిగాయి. నాగార్జున కొత్త డ్రెస్ తో, అదిరిపోయే స్టెప్పులతో వచ్చాడు. ఇక వచ్చీ రాగానే కంటెస్టెంట్స్ తో కొన్ని ఆటలు ఆడించాడు. 'ఆదికేశవ' మూవీ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ శ్రీలీల, హీరో వైభవ్ తేజ్ స్టేజ్ మీదకి వచ్చి తమ సినిమా గురించి మాట్లాడారు. ఆ తర్వాత హైపర్ ఆది వచ్చాడు. హౌస్ లో ఎవరెలా ఉన్నారో చెప్తూ ఒక్కొక్కరికి ఒక్కో సినిమా పేరుని ట్యాగ్ గా ఇచ్చాడు. కాసేపు అందరిని కడుపుబ్బ నవ్వించాడు. ఇక కాజల్ అగర్వాల్ తన సినిమా 'సత్యభామ' గురించి ప్రమోషన్స్ కోసం స్టేజ్ మీదకి వచ్చింది. హౌస్ మేట్స్ తో మాట్లాడి కాసేపు గేమ్ ఆడి వెళ్ళిపోయింది.
హౌస్ లో ఎవరు టాప్-5 లో ఉంటారో ఒక్కో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. అమర్ దీప్ వాళ్ళ అమ్మ, మానస్ స్టేజ్ మీదకి వచ్చి అమర్ దీప్ కి కాసింత బూస్ట్ ఇచ్చారు. అమర్ దీప్, శివాజీ, శోభాశెట్టి, గౌతమ్, పల్లవి ప్రశాంత్ టాప్-5 లో ఉంటారని అమర్ దీప్ ఫ్రెంఢ్ మానస్ అన్నాడు. కాసేపటికి గౌతమ్ కృష్ణ కోసం అన్నయ్య జగదీష్, హీరో చైతన్య వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి గౌతమ్ ఆట బాగుందని చెప్పారు.
గౌతమ్, అంబటి అర్జున్, శివాజీ, ప్రియాంక జైన్, అమర్ దీప్ టాప్-5 లో ఉంటాడని చెప్పారు. ఇలా ఒక్కో హౌస్ మేట్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి నామినేషన్ లో ఉన్నవాళ్ళని సేవ్ చేయగా యావర్, భోలే షావలి ఇద్దరు మిగిలారు. ఇక ఇద్దరి ఫోటోలతో ఉన్న రెండు చిచ్చుబుడ్డిలలో అంటించంగానే ఎవరి చిచ్చుబుడ్డి వెలుగుతుందో వారు సేఫ్ మిగిలిమ వారు అన్ సేఫ్ అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత యావర్ సేఫ్, భోలే ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పాడు. ఇక హౌస్ మేట్స్ కి బై చెప్పేసి స్టేజ్ మీద ఉన్న నాగార్జున దగ్గరికి వచ్చేశాడు భోలే. హౌస్ లో అయిదు వారాలు ఉన్న భోలే తన జర్నీ వీడియో చూసుకొని ఎమోషనల్ అయ్యాడు.
Also Read