ఇన్ స్టాగ్రామ్ లో రాధ క్వశ్చనింగ్!
on Feb 28, 2023
నటి రాధ.. ఒకప్పుడు తన అందంతో, అభినయంతో డ్యాన్స్ తో తన మార్క్స్ ని చాటుకుంది. హీరోలతో సమానంగా డ్యాన్స్ చేయగల నటి. తొంభైల్లో యాక్టివ్ గా ఉన్న రాధ తర్వాత పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయింది. రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. బిబి జోడీలో గెస్ట్ గా చేస్తూ అందరికి దగ్గరవుతూ వస్తుంది.
అయితే తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని పోటీ పెట్టింది. దాంతో తన అభిమానులంతా ప్రశ్నల వర్షం కురిపించారు. అలా అందరూ పంపిన వాటిలో నుండి కొన్నింటికి సమాధానాలు చెప్పుకొచ్చింది రాధ. తన కూతురు కార్తీక కూడా క్వశ్చన్ అడిగింది. మీ ముగ్గురు పిల్లలలో మీకు ఎవరంటే బాగా ఇష్టమని తన కూతురు కార్తీక ప్రశ్నించగా.. "నాకు ముగ్గురు పిల్లలు ఇష్టమే. ఏయ్ కార్తూ నువ్వే కదా.. నువ్వు ఇంట్లోనే ఉండి క్వశ్చన్ అడుగుతున్నావ్ కదా.. నాకు ముగ్గురు సమానమే. నువ్వు ముందు పుట్టావ్ కదా నువ్వంటే కొంచెం ఎక్కువ ఇష్టం.. ఇలా అన్నానని వాళ్ళిద్దరికీ చెప్పకు" అని రాధ చెప్పింది. ఆ తర్వాత మరొక అభిమాని.. "మేడమ్ మీకు ఎన్ని భాషలు వచ్చు" అని క్వశ్చన్ అడుగగా.. ఐదు భాషలు వచ్చని చెప్పి.. ఐదు బాషల్లో మాట్లాడింది. మళ్ళీ మూవీలో యాక్ట్ చేస్తారా మేడమ్ అని మరొకరు అడిగితే.. "త్వరలో .. అతిత్వరలో చేస్తాను " అని చెప్పింది. మరొక అభిమాని.. "మేడమ్ మీరు చిరంజీవి గారు కలిసి మళ్ళీ జంటగా నటిస్తారా" అని అడిగేసరికి... "ఓ గాడ్ దట్స్ ఏ ట్రికీ క్వశ్చన్. జంటగా ఉండాలంటే సో మెనీ క్రైటీరియా కదా.. స్టోరీకి తగినట్టు ఉండాలి. ట్రెండ్ లో ఉండాలి. ఫేర్ గానే ఉన్నాను కదా" అని సమాధనమిచ్చింది.
తమిళ్ లో మీ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్ ఎవరని ఒక అభిమాని అడుగగా.. "మై ఆల్ టైం ఫేవరెట్ యాక్టర్ శివాజీ గణేశన్, యాక్ట్రెస్ పద్మినీ అమ్మ" అని చెప్పింది. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి మేడమ్ అనగా.. "హ్మ్.. అది చెప్తే అందరూ రాధలాగా అవుతారు కదా.. అది చెప్పను" అని చెప్పింది. "డూ సమ్ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ మేడమ్.. యూ కార్తూ తులసీ అండ్ టుగెదర్" అని అడుగగా.. "కమింగ్ సూన్" అని సమాధమిచ్చింది రాధ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
