త్రినయని సీరియల్ కి శుభం కార్డ్ పడనుందా.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!
on Dec 26, 2024
జీతెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లో త్రినయని టాప్-5 లో ఉంది. అయితే ఈ సీరియల్ త్వరలో ముగుస్తుందనే వార్తలొస్తున్నాయి. జీతెలుగులో అత్యధిక రేటింగ్ వచ్చే సీరియల్స్‌లో త్రినయని ఒకటి. ఈ సీరియల్ ప్రారంభం నుంచి కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌ను సాధిస్తోంది. గత వారం ఈ సీరియల్‌కి 6.62 రేటింగ్ వచ్చింది. పడమటి సంధ్యారాగం సీరియల్ 8.49 రేటింగ్‌తో టాప్‌లో ఉంటే.. మేఘ సందేశం 7.98 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. నిండునూరేళ్ల సావాసం 7.87 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంటే.. జగద్ధాత్రి 7.02 రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక త్రినయని 6.62 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచింది.
త్రినయని సీరియల్ లో అషిక పదుకొనే (Ashika Padukone) త్రినయని పాత్రలో నటిస్తుండగా.. చందు బి గౌడ (Chandu B Gowda) విశాల్‌గా త్రినయని భార్తగా చేస్తున్నారు. చైత్రా హలికేరి.. తిలోత్తమగా కీలకపాత్రలో కనిపించింది. ఈ సీరియల్ ప్రారంభం నుంచి త్రినయని పాత్ర ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ సీరియల్ గత నాలుగేళ్ళుగా జీ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతోంది. అయితే తాజాగా ఈ సీరియల్ టైమ్ మారుతోందంటూ అప్డేట్ వచ్చేసింది. సోమవారం నుంచి శనివారం వరకూ రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ని.. కొత్త ఏడాది జనవరి 01 నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు మార్చేశారు.
జనవరి 1 నుంచి జీ తెలుగులో రాత్రి 8.30 గంటలకు ‘చామంతి’ (Chamanthi Serial Zee Telugu) అనే కొత్త సీరియల్ ప్రసారం కానుంది. దాంతో త్రినయని సీరియల్ మధ్యాహ్నం 2.30 గంటలకు మారింది. అయితే మధ్యాహ్నం 2.30 గంటలకు జీ తెలుగులో జానకి రామయ్య గారి మనవరాలు (Janaki Ramayya Gari Manavaralu Serial) ప్రసారం అవుతోంది. మరి ఆ సీరియల్‌ని మరో స్లాట్‌కి మారుస్తారా? లేదంటే సీరియల్‌ని ముగించేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జీతెలుగులో అత్యధిక టీఆర్పీ పొంతున్న ఈ సీరియల్ టైమింగ్ చేంజ్ చేయడంపై అభిమానులు తీవ్రంగా నిరాశని వ్యక్తం చేస్తున్నారు.
Also Read