ఆ దరిద్రులు చేసే నెగెటివ్ కామెంట్లను పట్టించుకోను!
on Jan 28, 2024
ఇన్ స్టాగ్రామ్ లో ఎందరో సెలెబ్రిటీలు తమ పర్సనల్ ఫోటోలని షేర్ చేస్తుంటారు. టూర్స్, ట్రావెలింగ్ అంటూ వాళ్ళు వెళ్ళిన చోటల్లా దిగిన వాటిని మెమరీలా చూసుకోడానికి అలా వాళ్ళు చేస్తుంటే కొంతమంది నెటిజన్లు మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. అలాంటివారిని ఉద్దేశించి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ కొన్ని వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన అశ్వినిశ్రీ.. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన పరిధిలో తను ఉంటూ ప్రేక్షకులకి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. నామినేషన్ లో భోలేని హీరో అనడంతో హౌస్ లో నవ్వులు పూసాయి. ఇక సీరియల్ బ్యాచ్ లోని ప్రియాంక. శోభాశెట్టిలతో వాదనలు హైలైట్ ఆఫ్ ది వీక్ గా నిలిచాయి. హౌస్ లో ఎక్కువగా భోలే షావలితో ఉన్న అశ్వినిశ్రీ.. ఓ నామినేషన్ లో ఎవరిని నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేషన్ అయింది. దాంతో తను ఎలిమినేషన్ అయింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది అశ్విని. అందులో తన క్రిస్మస్ సెలెబ్రేషన్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్, కజకిస్తాన్ టూర్ వ్లాగ్, భోలేతో బోల్డెన్ని కబుర్లు అంటు వ్లాగ్స్ చేయగా వాటికి విశేష స్పందన లభిస్తోంది.
అశ్వినిశ్రీ ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ మొదలెట్టింది. ఇందులో పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. యావర్ అంటే నీకు క్రష్ ఆ అని ఒకరు అడుగగా.. లేదండి, యావర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నామని అశ్విని అంది. నేను కర్నాటక నుండి మీకు నేను పెద్ద ఫ్యాన్ .. మీరు హౌస్ లోకి ఎంట్రీ అయినప్పటి నుండి ప్రతీ ఎపిసోడ్ చూసాను మనం ఒకసారి కలుద్దామా అని ఒకరు అడుగగా.. భాష అర్థం కాదు కదా ఎలా మేనేజ్ చేశారు. థాంక్స్ సో మచ్ అని అశ్విని రిప్లై ఇచ్చింది. రాజమండ్రి వచ్చినప్పుడు కాస్త మెన్షన్ చేయండి. మా బాధ మీకు తెలుసా అని ఒకరు అడుగగా.. ఓ థాంక్స్ ఐ లవ్ రాజమండ్రి. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానని అశ్వినిశ్రీ రిప్లై ఇచ్చింది. మీ పోస్ట్ లకి చాలా నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి కదా వాటి మీద మీ రియాక్షన్ ఏంటని అడుగగా.. ఏదైన పోస్ట్ చేసిన తర్వాత కామెంట్లని అస్సలు చదవను. ఎందుకంటే నాకంత టైమ్ ఉండదు. నెగెటివ్ కామెంట్లని పట్టించుకోను. కొంతమంది దరిద్రులు అలా నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా పెంచారో తెలిసిపోతుంది. ఎంత బ్యాడ్ గా కామెంట్ చేసిన నేను అసలు చూడను... పట్డించుకోనని అశ్వినిశ్రీ అంది. మీ కార్ డ్రైవింగ్ కి ఏం అయిన ఖాళీ ఉంటే చెప్పండి మేడమ్. మనీ లేకుండా చేస్తాను. ఎందుకంటే నేను మీకు బిగ్ ఫ్యాన్ ని అని అడుగగా.. నో వే ఐ లవ్ డ్రైవింగ్ అని రిప్లై ఇచ్చింది. ఇలా కొన్ని ప్రశ్నలకి సమాధానమిచ్చింది అశ్వినిశ్రీ. ఎప్పుడు హాట్ ఫోటోస్ తో ట్రెండింగ్ లో ఉండే ఈ భామ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
