నాకేం తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా: ఆరోహీ
on Jul 7, 2023
ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో ప్రపంచానికి పరిచయమైంది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహీ.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది.
తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహీ రావు. ఆరోహీ రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహీ చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహీ.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహీ.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహీ, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపిన ఆరోహీ.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో ఎక్కువ రోజులు ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ నడిపి ఎలిమినేషన్ అయిన ఆరోహీ.. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అయితే హౌస్ నుండి బయటకొచ్చాక ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆర్జే సూర్యతో రీల్ ని చేసింది. నేహా చౌదరి పెళ్ళికి అందరు కలిసి వెళ్ళి అక్కడ సరదాగా గడిపారు. అయితే ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ తెగ చేస్తోన్న ఆరోహీ.. ఇప్పుడు కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ఆప్ 'థ్రెట్స్'.. లో తనకంటూ అకౌంట్ క్రియేట్ చేసుకుంది ఆరోహీ. అయితే బిగ్ బాస్ స్క్రిప్టా కాదా అని తనని చాలామంది అడుగుతున్నారంటూ.. నాకేం తెలియదు, గుర్తులేదు మర్చిపోయా అని సరదాగా చెప్పింది ఆరోహీ.
Also Read