
బిబి జోడి సీజన్ 2 ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇందులో శ్రీసత్య - అర్జున్ కళ్యాణ్ ఒక జోడి. ఐతే వీళ్ళు చాల సార్లు గోల్డెన్ సోఫాను మిస్ చేసుకున్నారు. ఆ విషయాలను అర్జున్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. "సత్యకి గట్టిగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అందుకే మేము ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటాం. తర్వాత మళ్ళీ కలిసిపోతాం. మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎక్కువగా వస్తాయ్ మా మధ్య. ఏ పాటకు ఓపెనింగ్ ఎలా ఉండాలి. ఏ పాట చేద్దాం అలాంటివి. మా ఇద్దరి మధ్య ఎంతలా గొడవ అయ్యిందంటే ఆ అమ్మాయి షో వదిలేసి వెళ్ళిపోతాను అనేంత వరకు వెళ్ళింది. వెళ్ళిపోతానంటే వెళ్ళిపో అన్నాను. నేను సత్య స్పీడ్ కి మ్యాచ్ అయ్యానా లేదా స్టెప్ లు ఎవరివి ఎక్కువ మిస్ అయ్యాయి అనేది జనాలు చెప్పాలి.
మొదటి మూడు ఎపిసోడ్స్ టైములో నేను సీరియల్ చేస్తూ ఇది కూడా చేయాల్సి వచ్చేది. దాంతో బాగా స్ట్రైన్ ఇపోయా. కొరియోగ్రఫీ కూడా మాకు సెట్ ఐనట్టు ఇవ్వలేదు. ఇంతకు ముందు సంకేత్ ఉండేవాడు. మా బాడీ లాంగ్వేజ్ ప్రకారం అతను చెప్పేసేవాడు. కానీ ఇప్పుడు మాతో శార్వరి చేస్తోంది. ఫస్ట్ టైం ఆమె చేస్తోంది. ఫస్ట్ లో ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు అంతా సెట్ ఐపోయింది. గోల్డెన్ సోఫా ఒక్కసారే విన్ అయ్యాము. ఇమ్మానుయేల్ వచ్చి మాతో చేసిన ఎపిసోడ్ లో ఒక్క పాయింట్ తో గోల్డెన్ సోఫా మిస్సయ్యాం. మరి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలీదు.
ఆడియన్స్ కూడా అదే అంటున్నారు. కానీ స్టేజి మీద గొడవ చేసి పాయింట్ అవుట్ చేయడం వలన ఉపయోగం ఏమీలేదు. సత్య అప్పటికీ అడుగుతుంది. అడిగితే పాయింట్ లు తగ్గించేస్తారు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో . ఎందుకు ఈ తలనొప్పి అని నేను అడగను. నేను ఇంట్రావర్ట్ ని. బాగా ఫ్రీగా ఉంటేనే గాని మాట్లాడలేను. సత్య మాట్లాడేస్తుంది . నేను కూడా మాట్లాడితే ఇద్దరం నెగటివ్ ఇపోతాం అందుకే నేనేం మాట్లాడను " అని చెప్పాడు అర్జున్ కళ్యాణ్.






