Brahmamudi : ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టాలనుకున్న కావ్య.. రుద్రాణి రిక్వెస్ట్!
on Feb 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -953 లో..... రాజ్ తన బిడ్డ దగ్గరికి వచ్చి ఎత్తుకొని ముద్దాడుతాడు. నిన్ను మీ అమ్మ గుర్తుంచింది కానీ నేను గుర్తించలేదు. ఇప్పటికైనా మీ అమ్మ మాట నమ్మాను లేదంటే జీవితాంతం పశ్చాతాపంతో ఉండేవాడిని అని రాజ్ గిల్టీగా ఫీల్ అవుతాడు. అప్పుడే కావ్య వచ్చి ఏంటి అండి ఇది.. మీరు నన్ను నమ్మారు కాబట్టి ఇదంతా జరిగిందని కావ్య అంటుంది.
మరొకవైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. ఏమైంది అలా ఉన్నావని అడుగుతాడు. కావ్య అక్క పాప గురించి.. హాస్పిటల్ లో అదే రోజు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కానీ కావ్య అక్క పాపనే ఎందుకు మార్చారు ఇందులో ఏదో కుట్ర ఉంది కావాలనే మినిస్టర్ కి సలహా ఇచ్చి మార్చేశారు.. దీని వెనకాల ఎవరు వున్నారో కనుక్కోవాలని అప్పు రిక్వెస్ట్ చేయ్యగానే కళ్యాణ్ సరే అంటాడు. దీని వెనకాల మినిస్టర్ ఉన్నాడని తెలిసాక ఈ విషయం వదిలెయ్యాలని కళ్యాణ్ అనగానే అప్పు సరే అంటుంది. మరొకవైపు రాజ్, కావ్య పాపని రెడీ చేస్తారు. అప్పుడే పనిమనిషి శాంత ఏడుస్తూ ఉంటుంది. తన దగ్గరికి కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. నా కూతురికి బాలేదు ఆపరేషన్ చెయ్యాలన్నారు డబ్బు లేదని ఏడుస్తుంది శాంత. నువ్వు ఏడవకు మేం చూసుకుంటామని కావ్య చెప్తుంది. శాంత వెళ్ళిపోయాక కావ్య ఆలోచనలో పడుతుంది. ఏమైందని రాజ్ అడుగుతాడు. శాంతకి మనం హెల్ప్ చేస్తాం.. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా.. మనం మన ఫ్యామిలీ తరుపున ఛారిటబుల్ ట్రస్ట్ మొదలు పెడుదామని కావ్య అనగానే మంచి ఆలోచన ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామని రాజ్ అంటాడు.
మరొకవైపు మినిస్టర్ దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. ఎందుకు వచ్చావని మినిస్టర్ కోప్పడతాడు. నేను చేసింది తప్పే దానివల్ల నా పిల్లలు నన్ను ఛీ కొడుతున్నారు.. నేను రాజ్ మేనత్తని.. నన్ను ఇంట్లో నుండి గెంటేసారని కోపంతో ఇలా చేసాను కానీ ఈ విషయం వాళ్ళకి చెప్పాకండి అని రుద్రాణి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



