జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం హైపర్ ఆది ?
on Dec 20, 2024
జబర్దస్త్ షోకి యాంకర్ గా అనసూయ వెళ్లిపోయాకా చాలా మంది మారారు కానీ అప్పటికి ఇప్పటికీ ఒకే ఒక్క యాంకర్ రష్మీ మాత్రమే అలాగే ఆ షోస్ ని ఏలుతోంది. ఐతే ఈ గ్యాప్ లో సౌమ్య రావు కూడా జబర్దస్త్ యాంకర్ గా కన్నడ నుంచి వచ్చింది. కానీ చాలా కొద్దీ టైంలోనే వెళ్ళిపోయింది. ఐతే ఆమె షో నుంచి వెళ్లిపోవడానికి కారణం హైపర్ ఆది అనే టాక్ బాగా వైరల్ అయ్యింది. మరి ఇప్పుడు హైపర్ ఆది గురించి సౌమ్య తన మాటల్లో చెప్పుకొచ్చింది. "జబర్దస్త్ కి హోస్ట్ గా వచ్చినప్పుడు నాకు అసలు ఆ షో అంటే ఏంటో కూడా తెలీదు. హోస్ట్ అనసూయ అంటే కూడా ఎవరో తెలీదు. తర్వాత వాళ్ల వీడియోస్, షోస్ చూసి తెలుసుకున్నా. సుధీర్, రష్మీ జోడి నేనెప్పుడూ చూడలేదు. వాళ్ళ గురించి నాకేం తెలీదు. ఆఫ్ స్క్రీన్ లో సుధీర్ ఎం మాట్లాడరు.. వచ్చినప్పుడు హాయ్ అని వెళ్ళేటప్పుడు బై అని చెప్పి వెళ్ళిపోతారు అంతే.
సుధీర్ కి ఆటిట్యూడ్ అనేది ఏమీ లేదు. ఐతే నేను జబర్దస్త్ యాంకర్ గా చేసేటప్పుడు నా తెలుగును చూసి చాలా మంది నవ్వుకున్నారు. నేను నా భాషను కరెక్ట్ చేసుకుంటూ వచ్చా. ఐతే ఒక టైంలో హైపర్ ఆది వల్ల నేను బయటకు వచ్చేసాను అనే పుకారు వచ్చింది. కానీ హైపర్ ఆదికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నన్ను సపోర్ట్ చేశారు... వెళ్లిపోయారు. వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. వాళ్లకు మంచి ఆర్టిస్ట్ దొరికితే సపోర్ట్ చేస్తారు కానీ ఏమీ చేయరు. నా విషయంలో నా తెలుగు యాంకరింగ్ చూసి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి రండి బాగా మాట్లాడుతున్నారు ..మంచి టైమింగ్ ఉంది అని నన్ను దగ్గరుండి తీసుకెళ్లి షో డైరెక్టర్ కి చెప్పి నన్ను షోకి తీసుకొచ్చి సపోర్ట్ చేసారు. నేను జబర్దస్త్ షోలో యాంకరింగ్ నుంచి బయటకు రావడానికి ఆది కారణం కాదు.. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆదితో చేసిన కొన్ని ఎపిసోడ్స్ బాగా హైలైట్ అయ్యాయి " అంటూ సౌమ్య చెప్పుకొచ్చింది.
Also Read