ఇండస్ట్రీలో పూజలు చేసి కెరీర్ ని నాశనం చేయడం కామన్
on Feb 13, 2026

బుల్లితెర మీద సంథింగ్ స్పెషల్ షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు యాంకర్ రవి. తర్వాత పటాస్, ఆడాళ్ళ మజాక వంటి షోస్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. అలాంటి రవి రీసెంట్ గా ఒక షోకి వచ్చాడు. అక్కడ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. "ఒకప్పుడు ఎక్కడ చూసినా రవి, రవి, రవి అంటూనే ఉండేవాళ్ళు. రీసెంట్ టైమ్స్ లో ఎందుకు రవి నువ్వు తగ్గించావా లేకపోతే ఏంటి అంటూ హోస్ట్ అడిగింది. "15 ఏళ్ళు టీవిలో ప్రతీ ఒక్క ఛానెల్ లో అన్ని జానర్ షోస్ చేసుకుంటూ వచ్చినా వ్వాట్ నెక్స్ట్. టీవీ ఆర్టిస్టులు సినిమా చేయాలి అంటే దానికొక ఫార్ములా ఏర్పడింది. "మనుషులు ఎప్పుడైనా ఎవరైనా నీకు వెన్ను పోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా" అని అడిగింది. " మనుషులంటేనే వెన్నుపోటు" అన్నాడు రవి. వేరే వాళ్ళ కెరీర్ ని పోగొట్టడానికి అవ్వొచ్చు, వేరే వాళ్ళు పతనం ఇపోడానికి అవ్వొచ్చు కొన్ని పూజలు చేస్తారు అంటారు. నేను విన్నాను మీరెక్కడో మాట్లాడింది" అంది.
'ఇండస్ట్రీలో అది చాలా కామన్. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్ ల దగ్గర నుంచి చూసాను. మీతో పాటు కలిసి చేసిందా ఆ యాంకర్ అని అడిగింది హోస్ట్. నాతో పాటే యాంకరింగ్ చేసిన వాళ్ళే, జర్నీ చేసిన వాళ్ళే" అన్నాడు రవి. "కానీ ఆ టైములో నువ్వు ఎలా తీసుకున్నావు రవి" అని అడిగింది. "దేవుడు దగ్గరకు వెళ్లి ఆవిడ ఎప్పుడూ చల్లగా ఉండేలా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి అన్నాను. నేను వేరే వాళ్ళ దృష్టిలో తప్పు చేసి ఉండొచ్చు నా మనఃసాక్షికి అది రైట్ అనుకుని ముందుకు వెళ్తున్నాను." అన్నాడు రవి. "మీరుప్పుడైనా విన్నారా కొంతమంది యాంకర్స్ పక్కన ఎవరైనా ఉంటే చేయను అని" అని అడిగింది. "చాలామంది చెప్తారు. ఇప్పుడున్న యాంకర్స్ వాళ్ళతో ఐతే నేను చేయనండి అంటూ ధైర్యంగా చెప్తారు."అన్నాడు రవి. "నువ్వు లక్ ని నమ్ముతావా... టాలెంట్ నా" అని అడిగింది. "లక్ ని ఎప్పుడూ నమ్మకూడదు. హార్డ్ వర్క్ మాత్రమే చేయాలి. అర్హత పొందినోడికి అదృష్టం వస్తుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ఛాన్సెస్ వస్తాయి. అర్హత సంపాయించాడు కాబట్టి" అన్నాడు రవి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



