అలాంటి ప్రేమ దొరక్కపోతే...నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే
on Mar 25, 2025
బుల్లితెర మీద యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ కి యాంకర్ గా చేస్తూ మూవీస్ లో నటిస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఏ షోకి వెళ్లినా అదే ప్రశ్న అందరూ అడుగుతూ ఉంటారు. ఐతే పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణాన్ని ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చెప్పుకొచ్చింది. "పేరుకు మాత్రం నాకు తల్లి తండ్రులు ఉన్నారు. నాకు 12 ఏళ్ళ వయసు వచ్చేసరికి వాళ్ళు విడిపోయారు. భార్యాభర్తల మధ్య నేను ఒక స్టెబిలిటీని, బాండింగ్ ని చూసింది మా గ్రాండ్ పేరెంట్స్ మధ్యలోనే. ఇంటికి వెళ్ళడానికి నాకు వాళ్ళే మోటివేషన్ గా ఉండేవాళ్ళు. 2023 జనవరిలో అమ్మమ్మ తర్వాత 2024 ఆగష్టు లో మా తాతయ్య చనిపోయారు. అలా ఏడాది తేడాతో ఇద్దరూ చనిపోయేసరికి జీవితం మొత్తం ఖాళీ ఐపోయినట్టు అనిపించింది.
అందరూ అడుగుతుంటారు ఇంత వయసు వచ్చింది ఇంతవరకు వెళ్లేందుకు చేసుకోలేదు అని. నీ జీవిత భాగస్వామిని ఎందుకు చూసుకోవడం లేదు అని అడుగుతూ ఉంటారు. మా తాత, బామ్మ కలిసి మ్యారేజ్ లైఫ్ అంటే ఒక స్టాండర్డ్ ని క్రియేట్ చేసారు. 75 ఏళ్ళ వయసున్న వాళ్ళని వాళ్ళ పెళ్లి జీవితంలోని బాండింగ్ ని చూసాను. ఇంతవరకు అలాంటి బాండింగ్ ని నేను ఎవరి మధ్యలోనూ నేను చూడలేదు. తాతగారు ఓపికగా నడిచినంత కాలం కూడా ఆయన సాయంత్రం పూట వెళ్లి బామ్మ కోసం ప్రతీ రోజు మల్లె పూలు తెచ్చేవాళ్ళు. మా అమ్మమ్మకు ఎప్పుడైనా కోపం వస్తే సరిగా తల దువ్వుకునేది కాదు. తాత గారు అడిగేవాళ్ళు ఇంట్లో నూనె లేదా అని. అంటే వాళ్ళ మధ్య కోపం, ప్రేమ తెలుపుకోవడానికి ఇలాంటి ఒక అందమైన సీక్రెట్ కాన్వర్జేషన్ ఉండేది. అలాంటి ఒక రిలేషన్ షిప్ చూసాక ఈ కాలంలో సిట్యువేషన్ షిప్స్, బెంచింగ్, బ్రెడ్ కమింగ్ వంటివి చూస్తున్నా.. ఇలాంటి ఒక ఏజ్ లో నాకు అలంటి ఒక స్టాండర్డ్ లవ్ దొరక్కపోతే నేను ఎప్పటికీ నా జీవితంలో సెటిల్ కాలేను అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణాన్ని ఈరోజు మీ అందరికీ చెప్తున్నా" అంటూ ఎంతో ఎమోషనల్ గా పెళ్లి గురించి తన మనసులో ఉన్న ఆవేదనను షేర్ చేసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
