250 మందిలో తానొక్కతే అమ్మాయినని చెప్పిన నేహా చౌదరి!
on May 15, 2023
నేహా చౌదరి.. స్పోర్ట్స్ రిప్రెజంటర్ గా, యోగా ట్రైనర్ గా, యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. యాంకరింగ్ అంటే ఇష్టంతో బుల్లితెరపైకి అడుగుపెట్టిన నేహా.. పలు మూవీ ఆడియో ఫంక్షన్స్ కి హోస్ట్ చేసింది. ఆ తర్వాత ప్రో కబడ్డీ, ఐసీఐసీఐ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీకి యాంకర్ గా కూడా చేసింది నేహా. సైమా అవార్డ్స్-2019 ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
యాంకర్ గా గుర్తుంపు తెచ్చుకున్నాక నేహాకి బిగ్ బాస్ లో అవకాశం దక్కింది. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళిన తర్వాత తన ఆటతీరుతో మాటతీరుతో మెప్పించి క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ తర్వాత తన ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజు పెళ్ళి కూతురు గెటప్ లో వచ్చి నేహా అందరిని ఆశ్చర్యపరిచింది. తన స్నేహితుడు.. చిన్నప్పటి నుండి తన ఇంటిపక్కనే ఉండే తన స్నేహితుడినే పెళ్ళి చేసుకుంటున్నట్టు చెప్పిన నేహా.. పెళ్ళి ముహూర్తం వరకు తను ఎవరనేది సీక్రెట్ గా ఉంచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో తర్వాత నేహాకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. దాంతో తను సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటుంది. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండే నేహా తాజాగా ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళినట్లు చెప్పింది.
నేహా చౌదరి ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. అందులో తన సినిమా అప్డేట్ గురించి చెప్పింది నేహా. హైదరాబాద్ నుండి ఒక మూవీ షూటింగ్ కోసం పూణేకి వెళ్ళిన నేహా.. ఒక వారం నుండి అక్కడ షూటింగ్ లో పాల్గొంటోందట. హైదరాబాద్ నుండి 250 మంది కాస్ట్ అండ్ క్రూ వెళ్ళగా.. అందులో నేహా ఒక్కతే అమ్మాయంట. కానీ ఏ రోజు వాళ్ళు తనకి ఇన్ సెక్యూరిటీ, అన్ కంఫర్ట్ ఇవ్వలేదంట. బాగా చూసుకున్నారంట. తనకి ఒక హోమ్ లా అనిపించందంట. ఇలా తను నటిస్తున్న సినిమా గురించి చెప్తూ చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది నేహా చౌదరి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
