'జబర్దస్త్' నుంచి తప్పుకున్న అనసూయ.. షో పరిస్థితేంటి?
on Jun 29, 2022
అనసూయ బుల్లి తెర మీద ఒక ఆటం బాంబు. నవరసాలు పండించే యాంకర్. ఇటు స్మాల్ స్క్రీన్ మీద, అటు బిగ్ స్క్రీన్ మీద తన సత్తా చాటి దూసుకుపోతున్న స్టైలిష్ యాంకర్. పుష్ప మూవీలో సునీల్ భార్య పాత్రలో మాస్ రోల్ లో నటించింది అనసూయ. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందోననే ఆసక్తి కలిగిస్తోంది. కాగా జబర్దస్త్ షో ద్వారా ఇంతదాకా అనసూయ మంచి కామెడీని, హ్యూమర్ ని పంచుతూ వచ్చింది. చాలా కాలంగా ఈ షోకి హోస్ట్ చేస్తోంది అనసూయ. జబర్దస్త్ షో నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. ఇప్పుడు అనసూయ వంతు వచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే కానీ ఇప్పుడు సడెన్గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట.
తన కెరీర్లో ఇదే చాలా పెద్ద నిర్ణయం అని అంటోంది. "ఈ షోతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని నాతో తీసుకెళ్తున్నా అంది. ఇక ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను" అంటూ అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. మూవీస్ లో ఛాన్సెస్ వస్తుండడం, అలాగే మరో కొన్ని షోస్ తో ఎంగేజ్ కావడం వలన ఈ షో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా జబర్దస్త్ షో ఇప్పటికే రేటింగ్ పడిపోయి, నడవలేక నడుస్తోంది. ఇక ఇప్పుడు అందాల అనసూయ కూడా షో నుంచి తప్పుకుంది. ఇక ఎవరు ఈ షోని హ్యాండిల్ చేస్తారో, జబర్దస్త్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.