అనసూయ అందాలపై రచ్చ రచ్చ!
on Mar 25, 2025
బుల్లితెర మీదనే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడా అనసూయ తన సత్తా చాటుతూ ఉంటుంది. అలాగే ఆమె బోల్డ్ గా ఉంటుంది. ఎవరు ఎమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇచ్చిపడేస్తుంది. అలాంటి అనసూయ బుల్లితెర మీద కనిపించడమే మానేసింది.. మూవీ షూటింగ్స్ లో డివోషనల్ ప్లేసెస్ కి వెళ్లడంలో బిజీగా ఉంది. ఐతే రీసెంట్ గామే "చాలా రోజులయ్యింది.. కాసేపు మాట్లాడుకుందామా" అంటూ ఫాన్స్ ని పిలిచింది. ఇక నెటిజన్స్ ఐతే ఒక్కొక్కరు ఒక్కోలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఐతే చాలా మంది అనసూయ ఏజ్ గురించి, మేకప్ గురించి, డల్ ఫేస్ గురించి అలాగే బుల్లితెర మీదకు ఎప్పుడొస్తారు అంటూ అడిగారు. ఐతే తాను త్వరలోనే బుల్లితెర మీదకు రాబోతున్నట్లు చెప్పింది. అలాగే ఏజ్ రాను రాను తగ్గిపోతోంది, ఫేస్ లో గ్లో తగ్గుతోంది, కాన్సన్ట్రేట్ చేయండి అంటూ అడిగిన వాళ్లకు అనసూయ ఒకటే చెప్పింది.." ఏజ్ తగ్గిపోతోంది అంటున్నందుకు థ్యాంక్యూ కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఏజ్ తగ్గిపోవడం అంటూ ఏమీ ఉండదు. ఏజ్ తగ్గిపోవడం అనేది కంప్లిమెంట్ కాదు, ఏజ్ పెరుగుతోంది అన్నది ఇన్సల్ట్ కూడా కాదు.
మనం ఏజ్ రాకుండా ఆపలేము, అదే ఏజ్ లో ఉండిపోలేము. ఏజ్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్ ..కొన్ని సందర్భాల్లో డ్రెస్ బాగుండొచ్చు, కెమెరా మాన్ మంచిగా ఫొటోస్ తీసి ఉండొచ్చు, మంచి మేకప్ కిట్ ఉండి ఉండొచ్చు ఇలా కొన్ని కారణాలు అందంగా కనపడేలా చేస్తే హార్మోనల్ చేంజెస్, వాతావరణ మార్పులు, లైఫ్ స్టైల్ చేంజ్, షూటింగ్ టైం, ఎండా, నిద్ర సమయంలో మారిపోవడం ఇవన్నీ కూడా నా బాడీ మీద, నా ఫేస్ మీద మార్పులు చూపిస్తాయి. మీకు ఉండవా ఇలాంటివి..ఐనా నా గురించి కేరింగ్ గా అడుగుతున్నారు కాబట్టి నేను కేర్ తీసుకుంటాను" అని చెప్పుకొచ్చింది అనసూయ. అలాగే ఇంకో నెటిజన్ ఐతే సమ్మర్ టిప్ అడిగారు. "మీ శరీరంలోని మార్పుల గురించి ముందుగా చెప్తూ ఉంటుంది. కానీ నెగ్లెక్ట్ చేయకండి. వీలైనంత వరకు నిమ్మ రసం, చెరుకు రసం, పుచ్చకాయ, నారింజ, కొబ్బరి నీళ్లు అలాగే ఫుడ్ లోకి పచ్చిపులుసు, మజ్జిగ చారు వంటివి వేసుకుని తినండి. అలాగే కాటన్ డ్రెస్సులు వేసుకోండి. ప్రశాంతంగా ఉండండి" అంటూ టిప్ చెప్పింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
