అనసూయ కోసం రామ్‌చరణ్ చేసిన పని ఇది!
on May 1, 2021
.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో 'రంగస్థలం' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలో ప్రతీ పాత్ర ఆడియన్స్ ను అలరించింది. ముఖ్యంగా రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయకు మంచి పేరొచ్చింది. అంతగా తన పాత్రలో జీవించేసింది. అయితే 'రంగస్థలం' సినిమా అప్పటి నుండి ఆ యూనిట్ కి సంబంధించిన వారంతా తనను అత్త అనే పిలుస్తున్నారని.. సుకుమార్ కూడా అత్త అనే పిలుస్తారని అనసూయ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అనసూయ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా 'ఆహా'లో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ పలు యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసుకున్న కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. 'రంగస్థలం' సినిమా షూటింగ్ సమయంలో అనసూయ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా చెఫ్ ను పిలిపించి వంట చేయించేవారట. సెట్లో భోజనం సమయానికి చేపల కూర రెడీగా ఉండేదని.. కానీ అనసూయకి చేపల కూర తినే అలవాటు లేకపోవడంతో.. రామ్ చరణ్ తన చెఫ్ ను పిలిపించి ఆమె కోసం పన్నీర్ ను పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండించారట.
.jpg)
ఆ కూర ఎంతో రుచిగా ఉండేదని.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోకి అలా చేయాల్సిన అవసరం లేదని.. కానీ తన కోసం చెఫ్ తో ప్రత్యేకంగా అలా వంట చేయించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ 'పుష్ప' సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



